Relationship Tips: ఈ అబద్ధాలు పార్ట్‌నర్ దగ్గర చెబితే.. వివాహ బంధానికి ఇక ఎండ్ కార్డు పడినట్లే!

భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ వివాహ బంధం పెంట అవుతుంది. అయితే పార్ట్‌నర్ దగ్గర ఎప్పుడు కూడా బాగానే ఉన్నాను, పెద్ద సమస్య కాదు, చెప్పింది చేయకపోవడం, తర్వాత మాట్లాడుదాం వంటి అబద్ధాలు చెప్పకూడదని రిలేషన్‌షిప్ నిపుణులు అంటున్నారు.

New Update
Relationship Tips

Relationship Tips

భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికలు లేకపోతేనే వారి వివాహ బంధం హ్యాపీగా ఉంటుంది. అయితే కొందరు తెలిసో తెలియక కొన్ని విషయాలను పార్ట్‌నర్ దగ్గర దాచి పెడుతుంటారు. ఇలా చిన్న విషయాలను పార్ట్‌నర్ దగ్గర దాచిపెట్టడం వల్ల విడాకుల వరకు వెళ్తుందని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు. అయితే భార్యాభర్తల మధ్య చెప్పకూడని ఆ అబద్ధాలు ఏంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

బాగానే ఉన్నాను

పార్ట్‌నర్‌లో ఏవైనా మార్పులు వస్తే అంతా ఒకేనా.. ఏదైనా సమస్య అంటే చాలా మంది.. బాగానే ఉన్నాను, ఏ సమస్య లేదని అంటుంటారు. ఎన్నిసార్లు అడిగినా కూడా ఇలానే అంటారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య దూరం ఇంకా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ సమస్య అయినా కూడా పార్ట్‌నర్‌తో షేర్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య బాండ్ పెరుగుతుందని అంటున్నారు.

ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

పెద్ద సమస్య కాదు
పార్ట్‌నర్ ఏదైనా సమస్య ఉందని చెబితే.. ఇదేం పెద్దది కాదని కొందరు అంటుంటారు. ఇలా అనడం వల్ల ఫీల్ కావడంతో పాటు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

చెప్పింది చేయకపోవడం
కొంతమంది పార్ట్‌నర్ చెప్పింది చేస్తానని చెబుతుంటారు. కానీ ఆ తర్వాత మళ్లీ చేయరు. ఒకసారి అయితే ఏం కాదు.. కానీ మళ్లీ మళ్లీ ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. దీనివల్ల కొన్నిసార్లు గొడవలు విడాకుల వరకు వెళ్తుందని నిపుణులు అంటున్నారు.

తర్వాత మాట్లాడుదాం
భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే చాలా మంది తర్వాత చూద్దామని అంటుంటారు. ఎప్పుడు సమస్యను అప్పుడే క్లియర్ చేసుకోవాలి. తర్వాత మాట్లాడుకుందామని అంటే మాత్రం ఇద్దరి మధ్య దూరం పెరగడం పక్కా అని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి:IND vs ENG  :  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

Advertisment
తాజా కథనాలు