ఈ ఎర్రని పండు తింటే.. శరీరానికి అంతులేని బెనిఫిట్స్

ఎర్రటి బనానాలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉండటతో పాటు జీర్ణ సమస్యలు రావు. అలాగే రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెడ్ బనానా తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి కూడా లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

New Update
Intestinal health

Intestinal health

అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. అయితే చాలా మందికి కేవలం పసుపు రంగు అరటి పండ్లు ఉన్నాయని అనుకుంటారు. కానీ అరటిలో ఎరుపు, పచ్చ వంటివి కూడా ఉన్నాయి. పసుపు అరటి పండ్లు కంటే ఎరుపు రంగులో ఉండే అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి ఎరుపు రంగు అరటి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి:  AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

పేగు ఆరోగ్యం

ఎరుపు రంగులో ఉండే అరటి పండ్లను తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు డైలీ ఒక ఎర్ర అరటి పండును తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ అరటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం, పేగు సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

రోగనిరోధక శక్తి

ఎరుపు అరటి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నీరసం, అలసటతో ఇబ్బంది పడుతున్న వారు ఎరుపు అరటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

గుండె ఆరోగ్యం

రక్తపోటును నియంత్రించడంలో ఎరుపు అరటి పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందులోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. డైలీ ఎరుపు అరటి పండ్లను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు