ప్రేమ బంధం అంటే ఇద్దరు వ్యక్తులు.. ఒక గొడవ మరెన్నో కలయికలు. ఇంకెన్నో బుజ్జగింపులు, ఒక నమ్మకం, ఒక అలక మరెన్నో ప్రేమలు.. మొత్తంగా ఒకరి కోసం ఒకరు నిలబడటం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమను చూపిస్తుంది. వీటన్నింటిని ఎదుర్కొని నిలబడిన వారు ప్రేమలో హ్యాపీగా ముందుకుపోతారు. కానీ వీటిని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ప్రేమ విఫలం అవుతుంది. చిన్న చిన్న గొడవలకే బ్రేకప్‌లంటూ చెప్పుకుంటారు. నమ్మకం కుదరని రీజన్స్ చెప్పి దూరమవుతుంటారు. అయితే ప్రేమ విఫలం అయినప్పుడు గుండె బద్దలైనట్లు కొందరికి అనిపిస్తుంది.. ఆకాశం నుంచి పడే జోరు వానలా కన్నీళ్లు ఆపుకోలేకపోతుంటారు. ఏదో జరిగిపోతున్నట్లు భ్రమలో ఉండిపోతారు.. ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటారు. అయితే లవ్ ఫెయిల్ అయినపుడు మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు డోపమైన కీలక పాత్ర ప్రేమ విఫలం అయినపుడు ఎందుకు ఇంతలా బాధగా ఉంటుందో అనే విషయంపై స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఒక అధ్యయనం చేసింది. అయితే ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. లవ్‌లో ఉండేటప్పుడు బాడీలో ఎక్కువగా డోపమైన్ స్థాయిలు ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. లవ్‌లో ఉన్నపుడు మూడ్‌ను ప్రభావితం చేయడంలో డోపమైన్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడైంది. అదే సమయంలో బాడీలో నొప్పిని భరించే స్థాయిని డోపమైన్ ప్రభావితం చేస్తుందని అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిసింది. ఇది కూడా చూడండి: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ హార్ట్‌బ్రేక్ అయినట్లు ఎందుకు అనిపిస్తుంది? అయితే లవ్ ఫెయిల్ అయినప్పుడు హార్ట్ బ్రేక్ అయినట్లు ఎందుకు అనిపిస్తుందో కూడా నిపుణులు తెలిపారు. ప్రేమ విఫలం అయినపుడు గుండె బద్దలైనట్లు అనిపించడానికి ముఖ్య కారణం "బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్" అని ఓ వైద్యురాలు తెలిపారు. దీన్ని టకసుబో సిండ్రోమ్ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందన్నారు. దీనికి ముఖ్య కారణం పురుషుల కంటే మహిళల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉండటమే అని ఆమె తెలిపారు. ఇక బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌తో బాధపడేవారి మెదడు, శరీరంలోని కొన్ని భాగాల్లో చర్యలు మందగిస్తాయని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే.. ప్రేమికుల్లో బ్రేకప్ తర్వాత వచ్చే మానసిక వేదన అనేది.. బిడ్డకు ప్రసవం ఇవ్వడంతో సమానమని అధ్యయనంలో పాల్గొన్నవారు తెలిపారు. ఇది కూడా చూడండి: బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు కాగా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌తో బాధపడేవారు కొన్ని రోజులు లేదా కొన్ని నెలల్లో సాధారణ స్థితికి వచ్చేస్తుంటారు. కానీ మరికొందరిలో మరణం వరకూ కూడా పరిస్థితులు దిగజారొచ్చని పేర్కొన్నారు. ఇక హార్ట్ బ్రేక్ సమయంలో మెదడులో ఎన్నో మార్పులు జరుగుతుంటాయని నిపుణులు తెలిపారు. ఎందుకంటే బ్రేకప్ అయిన తర్వాత భాగస్వామితో కలిసున్న ఫొటోలు, వీడియోలు చూసుకుంటూ ఉంటారు. ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ దీంతో నొప్పి మరింత ఎక్కువై అది మెదడుపై మరింత భారం పడినట్లు చేస్తుంది. అప్పుడు ఆ బాధ నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. అందువల్ల మీరు నిజంగా ప్రేమించాలి అనుకున్నప్పుడు.. హార్ట్ బ్రేక్ నుంచి వచ్చే నొప్పిని తట్టుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలని.. దీనికి మరే ప్రత్యామ్నాయం లేదని మరో వైద్యుడు తెలిపారు. అంతేకాకుండా లవ్‌లో ఫెయిల్ అయినపుడు మానసిక వైద్యులను సంప్రదించాలని పరిశోధకులు చెబుతున్నారు.