Rainy Season: వర్షా కాలంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం ఎలా?

వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో ఎక్కువగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో చూద్దాం.

New Update
Immunity

Immunity

వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో ఎక్కువగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే తప్పకుండా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Health Suggestion: వాచిపోయిందా..? ఉపశమనం కోసం ఈ చిట్కాలు తెలుసుకోండి!!

పోషకాలు ఉండే ఫుడ్

రోగనిరోధక శక్తి పెరగాలంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ, నారింజ, జామకాయ, బొప్పాయి, కివీ వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. వీటితో పాటు ఆకుకూరలు పాలకూర, మెంతికూరతో పాటు బ్రకోలీ, బీన్స్, క్యారెట్ వంటి కూరగాయలను తీసుకోవాలి. అలాగే పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు, చికెన్ వంటి వాటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ పరార్ అవుతాయి. వర్షా కాలంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. 

ఇమ్యూనిటీ పెంచే పానీయాలు

వర్షా కాలంలో ఉదయం పూట తప్పకుండా గోరు వెచ్చని నీరు తాగాలి. దీనివల్ల  జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుందని నిపుణులు అంటున్నారు. రోజంతా కూడా గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే. వీటితో పాటు హెర్బల్ టీ తీసుకోవాలి. ముఖ్యంగా అల్లం, తులసి, మిరియాలు కలిపిన కషాయం లేదా టీ రోజూ తీసుకోండి. ఇది గొంతు నొప్పిని, జలుబును తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపు కలిపిన పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందులోని కర్కుమిన్ సహజ సిద్ధమైన యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తికి విటమిన్-డి చాలా అవసరం. ప్రతిరోజూ కొద్దిసేపు ఎండలో ఉండండి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. 

శుభ్రత

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి.  కాబట్టి శుభ్రత చాలా ముఖ్యం. బయటి నుండి రాగానే, తినడానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సీజన్‌లో ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తీసుకోకూడదు. ఇంట్లో తయారు చేసిన వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పండ్లు, కూరగాయలు తినే ముందు ఉప్పు నీటిలో లేదా వెచ్చని నీటిలో కడిగి ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

జీవనశైలిలో మార్పులు

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం, యోగా లేదా నడక వంటివి చేయాలి. వీటివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే రాత్రిపూట 7- నుంచి 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. తగినంత నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అధిక ఒత్తిడి కూడా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి ధ్యానం, ఇష్టమైన పనులు చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోండి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Health Tips: స్నానం ఉదయం చేస్తే మంచిదా? లేక రాత్రి చేస్తే మంచిదా?.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

Advertisment
తాజా కథనాలు