/rtv/media/media_files/2025/09/26/legs-swelling-2025-09-26-20-15-56.jpg)
Health Suggestion
కాళ్ళలో తరచుగా వచ్చే వాపును చాలా మంది సాధారణ బెణుకుగానో లేదా చిన్నపాటి ఉబ్బెత్తుగానో భావించి తేలికగా తీసుకుంటారు. కానీ ఇది సాధారణ సమస్య కాకపోవచ్చు. దీనిని వేరికోస్ వెయిన్స్ అని పిలుస్తారు. కాళ్ళలో నరాలు ఉబ్బడం, మెలికలు తిరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా నరాల బలహీనతే ఈ వాపుకు.. తీవ్రమైన నొప్పికి ప్రధాన కారణం. సరైన సమయంలో శ్రద్ధ వహించకపోతే ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి ఉబ్బిన నరాల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలను తెలుసుకుందాం.
ఉపశమనం కోసం మార్గాలు:
కంప్రెషన్ మేజోళ్ళు (Compression Stockings): వేరికోస్ వెయిన్స్ తగ్గించడానికి ఈ మేజోళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి కాళ్ళపై ఒత్తిడిని కలిగించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా వాపు మరియు నొప్పి తగ్గుతాయి.
కాళ్ళను పైకి ఉంచడం (Elevation): విశ్రాంతి తీసుకునేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు కాళ్ళను ఎత్తుగా ఉంచాలి. నిద్రించేటప్పుడు దిండ్లు లేదా మెత్తల సహాయంతో కాళ్ళను పైకి పెట్టి పడుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి.. నరాలపై ఒత్తిడి తగ్గి.. వాపు తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: ఇలాంటివి మీ నిత్యకృత్యాల్లో ఉన్నాయా..? అయితే మీ బొక్కలు డొల్ల కావడం ఖాయం..!!
సమతుల్య ఆహారం: నరాల సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి.. పొటాషియం, విటమిన్ సి మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల్య ఆహారం వాపును తగ్గిస్తుంది.
వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు సంకోచించి.. సాగి, రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ఇది నరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి కాళ్ళలో వాపు లేదా నొప్పి తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా.. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మరియు వైద్య సలహా తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: స్నానం ఉదయం చేస్తే మంచిదా? లేక రాత్రి చేస్తే మంచిదా?.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?