Pattu Dresses Wearing: పట్టు వస్త్రాలు ధరించి గుడిలోకి వెళ్తున్నారా.. ఎంత అరిష్టమో తెలిస్తే ఇంకోసారి అసలు పోరు!

పట్టు పురుగులను జీవహింస చేయడం వల్ల పట్టు దారం తయారు అవుతుంది. వీటితో తయారు చేసిన పట్టు వస్త్రాలను ధరించడం వల్ల అరిష్టం అని నిపుణులు అంటున్నారు. వీటిని ధరించి ఆలయాలకు వెళ్లకపోవడం, పూజలు చేయకపోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.

New Update
Pattu saree

Pattu saree

తెలుగు సంప్రదాయంలో పూజలు, పెళ్లి వంటి శుభకార్యాలు అయితే తప్పకుండా పట్టు వస్త్రాలు ధరిస్తారు. ఇవి చూడటానికి ఎంతో సంప్రదాయంగా ఉంటాయి. అయితే దేవాలయాలకు(temple) వెళ్లేటప్పుడు చాలా మంది ఈ పట్టు వస్త్రాలనే ధరిస్తారు. కానీ వీటిని ధరించి దేవాలయాలకు వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అసలు పట్టు వస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్తే ఎందుకు అరిష్టమో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Devi Navaratri 2025: నవరాత్రుల వేళ అదృష్టం వరించాలంటే.. ఈ వస్తువులు ఇంటికి తీసుకురావాల్సిందే!

ఆలయాలకు ధరించి వెళ్లకూడదని..

పట్టు వస్త్రాలు(pattu dresses) ధరించవచ్చు. కానీ వాటితో గుడికి వెళ్లడం, ఏవైనా శుభకార్యాలు చేయడం వంటివి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చీరలను పట్టుదారంతో తయారు చేస్తారు. ఈ పట్టు తయారీ అంతా ఒక  జీవహింస. పట్టు పురుగుల నుంచి పట్టు వస్త్రాలను తయారు చేసి దారాన్ని సేకరిస్తారు. సాధారణంగా పట్టు పురుగులు మల్బరీ ఆకులను తిని, తమ చుట్టూ గూడు కట్టుకుని లోపల నిద్రిస్తాయి. ఈ గూడు నుంచి పట్టు దారాన్ని తీయాలి. పురుగు ఆ గూడు నుంచి బయటకు వస్తే ఆటోమెటిక్‌గా దాని దారం తెగిపోతుంది. ఆ దారం తెగకుండా అలా నాణ్యంగా ఉండాలంటే లోపల ఉన్న పురుగులను వేడి నీళ్లలో వేస్తారు.

ఇది కూడా చూడండి: Dussehra 2025: రావణుడి ఈ 5 చెడు లక్షణాలు మీలో ఉంటే జీవితం నాశనమే!

ఇవి ఆ వేడి నీటిలో నరకయాతన అనుభవించి చనిపోతాయి. ఇలా చనిపోయిన పురుగుల గూడు నుంచి సన్నని పట్టు దారాన్ని లాగుతారు. ఒక్క పట్టు పంచె లేదా వస్త్రం తయారు చేయడానికి లక్షల సంఖ్యలో పట్టు పురుగులను ఈ విధంగా హింసించి చంపాలి. అయితే ఇలా జీవహింస చేస్తే వచ్చే పట్టు వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్లడం వల్ల మంచి కాకుండా అరిష్టం జరుగుతుందని పలువురు అంటున్నారు. మరికొందరు ఒక వస్తువు తయారు కావాలంటే ఇలా హింస తప్పదని అంటున్నారు. ఆలయాల దర్శనం, శుభకార్యాల సమయంలో వీటికి నాకుండా కాటన్ దుస్తులు ధరించడం మంచిదని, వీటివల్ల  మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు