/rtv/media/media_files/2025/10/02/ravanasura-2025-10-02-09-52-21.jpg)
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి(Dussehra 2025) పండగను జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం.. శ్రీరాముడు దశమి రోజునే రావణాసురుడిని సంహరించి సీతాదేవిని లంక నుంచి తీసుకొచ్చాడని చెబుతారు. రావణుడి మరణంతో చెడు పై మంచి విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా ప్రతీ ఏడాది నవరాత్రుల్లో వచ్చే దశమి రోజును విజయదశమి(Vijayadasami 2025) పండుగగా జరుపుకుంటారు. రావణుడు గొప్ప జ్ఞానీ, అపారమైన శక్తివంతుడు అయినప్పటికీ.. అతడిలో దుర్గుణాలు, అహంకారం అతని పతనానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో రావణుడు నుంచి మనం స్వీకరించకూడని ఐదు ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.. వీటిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే.. మీ జీవితాన్నే నాశనం చేస్తాయి.
Also Read : నవరాత్రుల వేళ అదృష్టం వరించాలంటే.. ఈ వస్తువులు ఇంటికి తీసుకురావాల్సిందే!
అహంకారం..
రావణాసురుడు తనకంటే గొప్పవారు, తెలివైన వారు శక్తివంతులు లేరని భావించాడు. అప్పుడు, తప్పుకు మధ్య తేడా మర్చిపోయాడు. ఆ అహంకారంతోనే సీతాదేవిని లంకలో బంధించి చివరికి శ్రీరాముడి చేతిలో పతనం అయ్యాడు.
దీని నుంచి మనం నేర్చుకోవాల్సి విషయం ఏంటంటే.. అహం భావన మనిషిని గుడ్డివాడిని చేస్తుంది. మంచి, చెడులను మర్చిపోయేలా చేస్తుంది. అహంకారం వల్ల మన చుట్టూ ఉన్న సంబంధాలు, కెరీర్ అన్నీ నాశనం అవుతాయి సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి కారణం అవుతుంది. కావున ఎంత సంపద, జ్ఞానం ఉన్నా.. ఎప్పుడూ వినయంగా ఉండాలి.
కోపంలో నిర్ణయాలు
రావణుడు కోపం, ఆవేశంతో తీసుకున్న ప్రతి నిర్ణయం చివరికి తప్పుగా మారింది. కోపం మనిషి ఆలోచన శక్తిని, ఓపికను హరించివేస్తుంది. కావున కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలకు తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది.
శక్తి దుర్వినియోగం
రావణాసురుడు అపారమైన శక్తిసామర్థ్యాలు కలిగిన వాడు. కానీ అతడి సామర్త్యాన్ని, శక్తిని మంచి కోసం కాకుండా చెడుపై ఉపయోగించాడు. కావున మనకున్న శక్తి, సామర్త్యాలను సమాజం మంచి కోసం, మానవాళికి ఉపయోగించాలి లేదంటే.. దాని ఫలితం వినాశనమే అవుతుంది.
మంచిని ఆచరించడం
తన శ్రేయస్సు కోరి చెప్పిన వారి మాటలను రావణుడు లెక్క చేయలేదు. తన సోదరుడు విభీషణుడు సీతమ్మను రాముడికి అప్పగించి లంకను కాపాడమని చెప్పినా, రావణుడు అహంకారంతో ఆ హితబోధను తిరస్కరించాడు. ఇది అతని పతనానికి దారి తీసింది.
కావున మనం ఎప్పుడూ మన శ్రేయోభిలాషులు, అనుభవజ్ఞులు చెప్పే మంచి మాటలను గౌరవించాలి, వినాలి. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు చెప్పినా, సరైన సలహాను వినడానికి మన అహంకారాన్ని పక్కన పెట్టాలి.
Also Read : దసరా రోజు జమ్మి చెట్టును పూజ చేస్తే ఇన్ని శుభాలా!