Mental Health: ప్రతి ఏడుగురిలో ఒకరికి ఆ సమస్యలు.. వెలుగులోకి సంచలన నిజాలు

ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలీ వల్ల అనేక మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రజల్లో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు పేర్కొంది.

New Update
Over 1 Billion People Were Affected By Mental Health Conditions In 2021, WHO

Over 1 Billion People Were Affected By Mental Health Conditions In 2021, WHO

ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలీ వల్ల అనేక మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రజల్లో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. ప్రతి ఏడుగురిలో ఒకరికి ఈ సమస్య ఉన్నట్లు చెప్పింది. వీళ్లు మానసిక వేదన (డిప్రెషన్), ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా యువతలో సూసైడ్ చేసుకోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Also Read: ఇది ఎవరి పాపం.. ఎలుకలు కొరికి హాస్పిటల్‌లో 2 పసిప్రాణాలు బలి

మొత్తంగా చూసుకుంటే ఈ మానసిక సమస్యలు అనేవి ప్రాణ నష్టంతో పాటు ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని WHO అంచనా వేసింది. 'వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే, మెంటల్ హెల్త్ అట్లాస్ 2024' పేరుతో WHO తాజా నివేదికను రిలీజ్ చేసింది. గ్లోబల్ హెల్త్ ఎస్టిమేట్స్ 2021 డేటాబేస్ ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించారు. యవతీయువకుల మరణాలకు సూసైడ్‌ చేసుకోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోందని ఈ నివేదిక పేర్కొంది. ప్రతి వంద మరణాల్లో ఒకటి సూసైడ్‌గా ఉందని తెలిపింది. అంతేకాదు 20 ప్రయత్నాల అనంతరం ఈ బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు చెప్పింది. 

Also Read: పగబట్టిన పాము.. 15 ఏళ్ల బాలికకు 42 రోజుల్లో 10 సార్లు కాటు.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

తాజా నివేదిక ప్రకారం ప్రతి 200 మందిలో ఒకరికి స్కిజోఫ్రెనియా, ప్రతి 150 మందిలో ఒకరు బైపోలార్ డిజార్డర్‌తో బాధపడున్నారు. అయితే ఇది ఆందోళన కలిగించే విషయమని WHO అంటోంది. మానసిక రుగ్మతల వల్ల కలిగే నష్టాలను ఇందులో అంచనా వేసినట్లు పేర్కొంది. వీటి వల్ల ప్రాణనష్టమే కాక ఆర్థికంగా కూడా తీవ్ర పరిణామాలు ఉన్నాయని చెప్పింది. అందుకే మానసిక, ప్రజారోగ్య పరిరక్షణపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాలని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసన్  సూచించారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.  

Also Read: స్కూల్స్, కాలేజీలకు సెప్టెంబర్ 7 వరకు సెలవులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు