Government Hospital: ఇది ఎవరి పాపం.. ఎలుకలు కొరికి హాస్పిటల్‌లో 2 పసిప్రాణాలు బలి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్‌లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువు, ఒక నవజాత శిశువు ఎలుకల దాడిలో మృతి చెందారు.

New Update
MP incident

ప్రభుత్వం హాస్పిటళ్ల పని అప్పుడప్పుడు ఇలాంటి వార్తల రూపంలో బయటపడుతోంది. ముక్కుపచ్చలారని పసికందుల ప్రాణాలు కొందరి నిర్లక్ష్యానికి బలయ్యాయి. ఒకటి కాదు.. వరుసగా రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అది కూడా చిన్నా చితక హాస్పిటల్ కాదు పెద్ద జిల్లా ఆస్పత్రి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్‌లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువు, ఒక నవజాత శిశువు ఎలుకల దాడిలో మృతి చెందారు. సెప్టెంబర్ 1న, 2 నెలల శిశువుని పీడియాట్రిక్ సర్జరీ వార్డులో చేర్చారు. ఆ శిశువు వెన్నుముక సంబంధిత సమస్యతో బాధపడుతోంది. రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, ఎలుకలు శిశువు చేతి వేళ్లను కొరికాయి. వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే, అప్పటికే శిశువు పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు మృతి చెందింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని ఆరోపించారు.

నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి

ఈ ఘటన జరిగిన మరుసటి రోజే, సెప్టెంబర్ 2న, అదే ఆసుపత్రిలోని నవజాత శిశువుల వార్డులో మరో దారుణం చోటుచేసుకుంది. పుట్టిన కొన్ని గంటలకే ఆరోగ్యం క్షీణించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచిన ఓ పసికందుని ఎలుకలు కరిచి చంపేశాయి. ఈ ఘటనపై ఆందోళన చెంది, కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు నిరసనలకు దిగారు.

అధికారుల చర్యలు:
ఈ ఘటనలపై తీవ్ర ఒత్తిడి రావడంతో, ఆసుపత్రి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ రెండు దురదృష్టకర సంఘటనలకు బాధ్యులైన ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, పెస్ట్ కంట్రోల్ బాధ్యతలు చూస్తున్న కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించారు. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు నిర్వహించడానికి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి డీన్ డాక్టర్ అరవింద్ ఘంఘోరియా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

అయితే, ఈ ఘటనలు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పేద ప్రజలు, నిస్సహాయ శిశువుల ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రులలోనే ఇలాంటి దుర్ఘటనలు జరగడం దారుణమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు