/rtv/media/media_files/2025/11/05/kartik-purnima-2025-2025-11-05-13-31-09.jpg)
Kartik Purnima 2025
సంవత్సరంలో అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా కార్తీక పౌర్ణమి(Kartika Purnima 2025)ని చెబుతారు. హిందూ విశ్వాసాల ప్రకారం.. ఈ రోజున దేవతలు సైతం భూమిపైకి దిగి వచ్చి దీపావళి పండుగ(Diwali 2025) ను జరుపుకుంటారని చెబుతారు. దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. అంతేకాక ఈ శుభదినం నాడు గురు నానక్ దేవ్ జీ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ కారణంగా కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి బుధవారం నవంబర్ 5, 2025 న వచ్చింది. ఈ పవిత్రమైన రోజును భక్తి, విశ్వాసం, కృతజ్ఞతలకు సంబంధించిన సందర్భంగా భావిస్తారు. అయితే భక్తులు ఈ రోజున తప్పకుండా చేయకూడని ఐదు ముఖ్యమైన విషయాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి రోజు చేయకూడని పనులు:
తులసి ఆకులను తుంచవద్దు:కార్తీక పౌర్ణమి రోజున తులసి ఆకులను అస్సలు తుంచకూడదు. హిందూ ధర్మంలో తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఈ శుభదినాన తులసి ఆకులను తుంచడం వల్ల లక్ష్మీదేవికి అగౌరవం కలిగించినట్లవుతుంది. ఇది దురదృష్టాన్ని తీసుకురావచ్చని పండితులు చెబుతున్నారు.
తామస ఆహారానికి దూరం: కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం పాటించినా, పాటించకపోయినా తామస ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మాంసం, చేపలు, గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామస ఆహారాలు ఆధ్యాత్మిక పవిత్రతకు భంగం కలిగిస్తాయి కాబట్టి వాటిని తినకూడదు.
ఇది కూడా చదవండి: బెల్లంతో శ్వాస సంబంధిత సమస్యలకు పరిష్కారం.. అది ఎలానో ఇప్పుడే తెలుసుకోండి!!
ఎవరినీ ఖాళీ చేతులతో పంపవద్దు: ఈ పవిత్రమైన రోజున ఇంటికి ఏదైనా అవసరంలో ఉన్నవారు.. పేదవారు లేదా వృద్ధులు వస్తే వారిని ఖాళీ చేతులతో వెనక్కి పంపకూడదు. మీ శక్తికి అనుగుణంగా ఆహారం, పండ్లు, ఇతర వస్తువులను దానం చేయండి.
ఈ వస్తువులను దానం చేయవద్దు: కార్తీక పౌర్ణమికి చంద్రుడికి (Moon) సంబంధం ఉంది. కాబట్టి ఈ రోజున పాలు, వెండి లేదా తెల్లని వస్తువులను ఎవరికీ దానం చేయకూడదు. శాస్త్రాల ప్రకారం.. ఇలా చేయడం వల్ల చంద్ర దోషం (Chandra Dosha) పెరుగుతుందని చెబుతారు.
ఇంటిని చీకటిగా ఉంచవద్దు:కార్తీక పౌర్ణమి రోజున ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ప్రతి గదిలో దీపాలు వెలిగించి వెలుగు ఉండేలా చూసుకోవాలి. దేవ దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: రేపే కార్తీక పౌర్ణమి.. స్నానం, పూజకు సరైన సమయం ఇదే..!!
Follow Us