/rtv/media/media_files/2025/05/05/Sz9x6JyWl668SuTdqXFa.jpg)
Mis World
ప్రపంచ సుందరి కావాలి చాలా మంది కలలు కంటారు. అయితే కేవలం అందం ఉంటే సరిపోతుందని చాలా మంది భావిస్తారు. నిజానికి అందాల పోటీలకి అందం ఉంటే సరిపోతుందా? లేకపోతే ఇంకా ఏవైనా అర్హతలు ఉండాలా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!
పౌరసత్వం తప్పకుండా..
అందాల పోటీల్లో పాల్గొనాలంటే అమ్మాయిలకు తప్పకుండా కొన్ని అర్హతలు ఉండాలి. కేవలం అందం ఉంటే సరిపోదు. దానికి తగ్గట్లు తెలివి కూడా ఉండాలి. అలాగే అమ్మాయిల వయస్సు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఈ ప్రపంచ సుందరి పోటీలకు పాల్గొనే వారికి పెళ్లి కాకూడదు. అలాగే పిల్లలు కూడా ఉండకూడదు. ఈ పోటీల్లో పాల్గొనే అమ్మాయిలకు ఎలాంటి క్రిమినల్ రికార్డు కూడా ఉండకూడదు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్
ఈ పోటీల్లో కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్‌జెండర్స్ కూడా పాల్గొనవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా పౌరసత్వం ఉండాలి. ఏ దేశం నుంచి పాల్గొంటున్నారో ఆ దేశ పౌరసత్వం ఉండాలి. లేకపోతే అక్కడ సొంత ఇళ్లు ఉన్నా కూడా పౌరసత్వం తీసుకోవచ్చు. ఈ పోటీల్లో అందంతో పాటు ఎక్కువగా తెలివితేటలు, కమ్యూనికేషన్, నైపుణ్యాలు, దయ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. నిర్థిష్టమైన ఎత్తు, బరువు ఉండాలని అయితే రూల్స్ లేవు. కాకపోతే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలి.
ఇది కూడా చూడండి: Indo-Pak tension: పాకిస్థాన్‌పై దాడి లాంఛనమే.. IAF చీఫ్‌తో ప్రధాని మోదీ
స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఉండాలి. అన్నింటి కంటే ముఖ్యంగా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు ముందు టాలెంట్ రౌండ్, బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ వంటి పోటీలు ఉంటాయి. ఇంగ్లీష్ తప్పకుండా రావాలి. అలాగే కమ్యూనికేషన్, సామాజిక అంశాలపై అవగాహన ఉండాలి. అప్పుడే ఈ పోటీలకు అర్హత సాధిస్తారు.