Mistakes in Boiling Milk: పాలను మరిగించేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త

పాలను ఎక్కువ సమయం మరిగించడం వల్ల అందులోని పోషకాలు పూర్తిగా నాశనం అయిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మళ్లీ మళ్లీ పాలను మరిగించడం, పెద్ద మంటపై వేడి చేయడం వల్ల కూడా పోషకాలు పోతాయి. పాలను మీడియం మంటలోనే వేడిచేయాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
 Milk

Milk Photograph: (Milk)

Mistakes in Boiling Milk: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని డైలీ తీసుకోవడం వల్ల కండరాలు, ఎముకలు(Muscles, Bones) ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే కొందరికి తెలియక పాలను మరిగించేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. దీంతో అందులోని పోషకాలు అన్ని కూడా తొలగిపోతాయి. అయితే పాలను మరగించేటప్పుడు చేయకూడదని ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి:HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

ఎక్కువగా మరిగించకూడదు

పాలను కొందరు ఎక్కువ సమయం మరిగిస్తుంటారు. అలాగే మళ్లీ మళ్లీ పాలను మరిగిస్తుంటారు. ఇలా మరిగించడం వల్ల పాలలోని పోషకాలు అన్ని కూడా నాశనం అయిపోతాయి. ఇలాంటి పాలను తాగినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి పాలను ఎక్కువగా మరిగించడం లేదా మళ్లీ మళ్లీ మరిగించి కూడా తాగవద్దు.

ఇది కూడా చూడండి:BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

పెద్ద మంటపై మరిగించినా కూడా..

తొందరగా పాలు మరగాలని కొందరు పెద్ద మంట పెడుతుంటారు. దీనివల్ల కూడా పాలలోని పోషకాలు పూర్తిగా తగ్గిపోతాయి. పాలను ఎల్లప్పుడూ కూడా మీడియం మంటలోనే మరిగించాలి. అప్పుడే అందులోని పోషకాలు శరీరాకి అందుతాయి. పాలను మీడియం ఫ్లేమ్‌లోనే మరిగించడమే సరైన పద్ధతి. అప్పుడే అందులోని కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు అన్ని కూడా శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి:Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు