/rtv/media/media_files/2025/10/30/kidney-health-2025-10-30-16-02-18.jpg)
kidney health
Kidney Health: సాధారణంగా మూత్ర విసర్జన చేసినప్పుడు మూత్రం లేత పసుపు నుంచి ముదురు రంగులో కనిపించడం సహజం. మనం తినే ఆహరం నుంచి ఆనారోగ్య సమస్యల(health-problems) వరకు అనేక అంశాలు మూత్రం రంగు మారడానికి కారణాలు. అయితే కొంతమందిలో నురగతో కూడిన యూరీన్ రావడం కనిపిస్తుంది. ఇలా రావడం ఏదైనా మూత్రపిండాల సమస్యలకు సంకేతమా? మూత్రం నురగగా రావడానికి గల కారణమేంటి ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రాశయం నిండిపోయినప్పుడు మూత్రం ప్రెజర్ తో బయటకు రావడం వల్ల నురగ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు. ఇలా కాకుండా తరచూ నురగతో కూడిన మూత్రం వస్తే.. అది మూత్రపిండాల సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ పరిస్థితిల్లో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Also Read : నేడు ఈ రాశులకు యమ డేంజర్.. ఈ ఒక్క జాగ్రత్త పాటించకపోతే ఏడు జన్మల శని అంతా మీతోనే!
మూత్రం నురుగు ఎందుకు వస్తుంది?
మూత్రం నిరంతరం నురగగా వస్తుంటే.. అది మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ కి సంకేతం కావచ్చు. కిడ్నీ ఫిల్టర్స్ సరిగ్గా పనిచేయని పరిస్థితిలో ఇలా జరుగుతుంది. మూత్రం నురగగా వచ్చే ఈ కండీషన్ ను ప్రోటీన్యూరియా అంటారు. ప్రోటీన్యూరియా అంటే.. యురీన్ లో ఆల్బుమిన్ వంటి ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉండడం. ఇది కిడ్నీ దెబ్బతినడం లేదా కిడ్నీ వ్యాధి(kidney-health) కి ముందస్తు సంకేతం కావచ్చు.
కిడ్నీ ఫేల్యూర్ ఇతర సంకేతాలు
- చేతులు, కాళ్ళు, ముఖం, ఉదరంలో వాపు.. మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోయే ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
- అలసట
- ఆకలి లేకపోవడం
- వికారం, వాంతులు
- నిద్రపోవడంలో ఇబ్బంది
- మూత్రం రంగులో మార్పు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
Also Read: Mahesh Babu: SSMB29 షూటింగ్ కి బ్రేక్.. మాల్దీవ్స్ లో మహేష్ బాబు! ఫొటోలు చూశారా?
Follow Us