/rtv/media/media_files/2025/04/11/bokiZfZItwRiv7aIXIu8.jpg)
lip care_ unhealthy lips indicates health issue
Lips Health: పెదవుల ఆధారంగా మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? అవును మన పెదవులు మన ఆరోగ్య పరిస్థితిని నిర్ణయిస్తాయి. చలికాలం,వేసవికాలంతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో పెదవులు వాడిపోయినట్లుగా అనిపించడం, పగుళ్లు రావడం గమనిస్తుంటారు. అయితే ఈ పరిస్థితి శరీరంలో పోషకాహార లోపానికి సంకేతం.
ఇది కూడా చదవండి: బీపీ చెక్ చేసుకునేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఇది కూడా చదవండి: హిట్ అండ్ రన్.. అమ్మాయిని ఢీకొట్టి స్కోడా కారు పరార్!
ఎలాంటి పెదాలు దేనికి సంకేతం
పెదవులు నల్లగా మారడం
స్మోక్ చేయకపోయినా పెదాల రంగు నల్లగా మారడం శరీరంలో మెలనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరగడాన్ని సూచిస్తుంది. మెలనిన్ ఎక్కువైనప్పుడు పెదాలు నల్లగా మారడం ప్రారంభమవుతాయి. నల్లదనాన్ని నివారించడానికి జామకాయ తినడం ఆరోగ్యకరం.
పెదవులు ఎండిపోవడం
పెదవులు తరచూ పొడిగా కనిపిస్తే డీ హైడ్రేషన్ సమస్యకు సంకేతం. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడం ద్వారా.. పెదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి.
అధికంగా పగిలిన పెదవులు
పెదవులు రక్తం కారుతూ తీవ్రంగా పగిలిపోవడం శరీరంలో ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్ లోపానికి సంకేతం. కావున ప్రతిరోజూ డైట్ లో వాల్ నట్స్, ఇతర ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. పగుళ్ళకు లిప్ బామ్ రాసుకోవడానికి బదులుగా సరైన పోషకాహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పెదవుల అంచులలో పగుళ్లు
కొంతమందికి పెదవుల అంచుల్లో పగుళ్లు ఏర్పడతాయి. ఇది తీవ్రమైన నొప్పితో పాటు రక్తస్రావాన్ని కలిగిస్తుంది. ఈ సమస్య విటమిన్ బి2 లోపం వల్ల తలెత్తుతుంది. ఈ పోషకాహార లోపాన్ని నివారించడానికి మస్రూమ్, డైరీ ప్రాడక్ట్స్, గుడ్లు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
పేలిపోయిన పెదాల రంగు
పెదవుల రంగు పేలిపోయి కనిపించడం ఐరన్ లోపానికి సంకేతం. దీనిని నివారించడానికి ఐరన్ అధికంగా ఉండే మీట్, ఆకుకూరలు, డేట్స్, నట్స్, పప్పు దినుసులు వంటి ఆహారాలు తీసుకోవాలి.
latest-news | life-style | lips
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్
Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!