/rtv/media/media_files/2025/04/11/0OBwIfhOzzN8eA1j6K0c.jpg)
Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya: ఇటీవల యువతను బాగా ఆకట్టుకున్న హీరోయిన్లలో బేబీ బ్యూటీ వైష్ణవీ చైతన్య పేరు ముందుగా వినిపిస్తోంది. ‘బేబి’ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ తార, తన గ్లామర్, అభినయం తో బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగు అమ్మాయిగా ఆమెకి వచ్చిన ఆదరణతో ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లతో కూడా గట్టి పోటీగా నిలిచింది. తనకున్న టాలెంట్ తో యూట్యూబ్ వెబ్ సిరీస్ నుంచి హీరోయిన్ స్టేజ్ వరకు ఎదిగింది. హీరోయిన్ గా అయితే మూవీస్ చేస్తుంది కానీ ఈ ఫేమ్‌ను కొనసాగించడం ఆమెకు పెద్ద సవాలుగా మారింది.
Also Read: ‘సోదరా’ ట్రైలర్ చూశారా..? సంపూ రచ్చ మాములుగా లేదుగా!
పాత్రల ఎంపికలో జాగ్రత్త అవసరం..!
రీసెంట్ గా వైష్ణవి నటించిన ‘లవ్ మీ’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ, ఆమె పాత్ర మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కేవలం వైష్ణవి కోసం ఆ మూవీకి వెళ్లిన ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే మిగిలింది. స్క్రీన్ మీద వైష్ణవి పాత్రకు తగిన బలం లేకపోవడం వల్ల ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు. దీంతో వైష్ణవి పాత్రల ఎంపికలో కొంత జాగ్రత్త అవసరం ఉందనే టాక్ ఎక్కువవుతోంది.
Also Read: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి
తాజాగా విడుదలైన ‘జాక్’(Jack Movie) సినిమాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రంలో వైష్ణవీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని, అలాంటి రోల్స్‌కి దూరంగా ఉండాలి అనే సూచనలు వినిపిస్తున్నాయి. అభినయం ఉన్నప్పటికీ, క్యారెక్టర్ డెఫినిషన్ లోపిస్తే ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టం అవుతుంది.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
సినీ రంగంలో ఒక్క సినిమా హిట్ కావడం కంటే, హిట్ తర్వాత వచ్చిన ఆ క్రేజ్‌ని కాపాడుకుంటూ మంచి ప్రాజెక్ట్స్‌కి సైన్ చేయడమే అసలైన విజయ మార్గం. వైష్ణవీ ఇప్పటికీ కెరీర్ ప్రారంభ దశలోనే ఉంది. ఇలాంటి సమయంలో కథలు, పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు ఇకనైనా వైష్ణవి కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..