/rtv/media/media_files/2025/11/09/tea-leaves-2025-11-09-13-11-31.jpg)
Tea leaves
ఉదయం లేవగానే వేడి వేడి టీ తాగడం మన దేశంలో చాలామంది దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. ఒక కప్పు టీ తాగితే కొత్త ఉత్తేజం వస్తుంది. కొందరు రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగితే.. మరికొందరు 8 నుంచి 10 కప్పుల వరకు తాగుతారు. అయితే ప్రతి ఆహార పదార్థంలాగే.. మనం ఉపయోగించే తేయాకుకు కూడా గడువు తేదీ (Expiry Date) ఉంటుందా అని ఎప్పుడైనా ఆలోచించారా..? చాలా మందికి ఈ విషయం తెలియదు. టీ ఆకులు గడువు ముగుస్తాయా? అవి చాలా కాలం మాత్రమే తాజాగా ఉంటాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
టీ ఆకులలో సహజ నూనెలు (Natural Oils), యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గాలి, తేమ, కాంతికి గురైనప్పుడు.. ఇవి విచ్ఛిన్నం కావడం ప్రారంభిస్తాయి. దీనివల్ల టీ ఆకుల నాణ్యత తగ్గి పాడవుతుంది. అయితే గడువు ముగిసిన టీ ఆకులు విషపూరితం కాదు లేదా హానికరం కాదు. కానీ దాని రుచి, రంగు, సువాసన తగ్గడం మొదలవుతుంది. గడువు ముగిసిన టీ తాగినట్లయితే.. దాని రుచి, వాసనలో తేడా వస్తుంది. కొన్నిసార్లు పాత టీ ఆకులు కొద్దిగా అచ్చు (moldy) లేదా తడి వాసనను ఇస్తుంది.
ఇది కూడా చదవండి: బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుందా..? పచ్చి మిర్చితో తగ్గించుకునే ఉపాయం తెలుసుకోండి!!
టీ ఆకులు రకాన్ని బట్టి దాని నిల్వ సమయం మారుతుంది. అయితే ఇవి పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచినప్పుడు మాత్రమే ఈ సమయం చెల్లుబాటు అవుతుంది. టీ ఆకులను ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. దానిని ఎల్లప్పుడూ గాలి చొరబడని డబ్బాలో (Airtight Container), సూర్యరశ్మి, వేడి, తేమకు దూరంగా పొడి ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఇలా నిల్వ చేయడం వలన తేయాకు యొక్క షెల్ఫ్ లైఫ్ (Shelf Life) ను పెంచవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: నారింజ తొక్కే కదా అని తీసి పారేయకండి.. ఇంట్లో గాలికి శుద్ధి చేయడంలో దాని ప్రాముఖ్యం తెలుసుకోండి!!
Follow Us