AIIMS: ప్రస్తుతం గుండె ప్రమాదాలు వయసుతో సంబంధం లేకుండానే వస్తున్నాయి. చిన్న వయసులోనే ఈ ప్రమాదంలో మృత్యవాత పడేవారి సంఖ్య ఎక్కువైది. ఒక్కసారి గుండె ఆగిపోయిందే బతికే అవకాశం ఉండదు. కానీ ఓ జవాన్‌కి ఆగిపోయిన గుండెకు పునర్జన్మ ఇచ్చారు ఎయిమ్స్ వైద్యులు. శుభాకాంత్ సాహు (24) అనే సైనికుడు తీవ్ర అనారోగ్య సమస్యతో గత నెల 1న భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. కొద్దిసేపటికే గుండె ఆగింది. అతడి గుండె దాదాపు 90 నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో 40 నిమిషాల పాటు సీపీఆర్‌ను డాక్టర్లు నిర్వహించారు. అయిన జవాన్ గుండెలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఎక్స్‌ట్రాకార్పోరియల్ కార్డియో- పల్మనరీ రిససిటేషన్ ప్రయోగించాలని డాక్టర్లు నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: జనవరిలో దావోస్‌కు సీఎం చంద్రబాబు
గుండె పనితీరు మెరుగుపడింది:
డాక్టర్ శ్రీకాంత్ బెహరా నేతృత్వంలోని ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్‌తో వైద్యం ప్రారంభించారు. 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకుంది. 30 గంటల తర్వాత గుండె పనితీరు మెరుగుపడిందని వైద్య బృందం తెలిపింది. 96 గంటల తర్వాత ఎక్మోను తొలగించారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరు సరిగాలేనివారికి ఎక్మో చికిత్సను ఉపయోగిస్తారు.
ఇది కూడా చదవండి: అంబులెన్స్‌కు దారివ్వలేదని రెండున్నర లక్షల ఫైన్
ఇది ఊపిరితిత్తులు, గుండె విధులను వేర్వేరుగా, ఉమ్మడిగా నిర్వర్తిస్తుంది. జవాన్‌కి చేసిన ఈ విధానం ఈసీపీఆర్ విధానం సాంకేతికంగా సవాళ్లతో ఉన్నా గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం జవాన్ పూర్తి స్పృహలో ఉన్నాడని వైద్యులు తెలిపారు. సైనికుడి గుండెకు పునర్జన్మ ప్రసాదించి ఎయిమ్స్ వైద్యులు విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఇష్టమైన పండు..ఇది తింటే రోగాలు పరార్
ఇది కూడా చదవండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు