AP:అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

ఏపీ నుంచి శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. మచిలీపట్నం నుంచి కొల్లాంకు డిసెంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేకరైళ్లు నడుస్తాయి.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

AP:

ఏపీ నుంచి శబరిమలకు వెళ్లాలనుకునే అయ్యప్ప భక్తులకు రైల్వే అధికారులు తీపి కబురు చెప్పారు.విజయవాడ మీదుగా శబరిమలకు  ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం-కొల్లాం (07145) స్పెషల్ ట్రైన్‌  డిసెంబరు 2, 9, 16 తేదీల్లో మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.15కి బయలుదేరుతుంది.. మరుసటి రోజు రాత్రి 9.20కి కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు (07146) తిరుగు ప్రయాణంలో డిసెంబరు 4, 11, 18 తేదీల్లో కొల్లాంలో తెల్లవారుజామున 2.30కి బయలుదేరి రెండో రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. 

Also Read: TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు

ఈ రైలు ఏపీలోని మచిలీపట్నం, పెడన, గుడివాడ, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగనుంది.మరో ప్రత్యేక రైలు (07147) మచిలీపట్నం-కొల్లాం మధ్య నడవనుంది. డిసెంబరు 23,30 తేదీల్లో మచిలీపట్నంలో మధ్యాహ్నం 12గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.20కి కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు (07148) తిరుగు ప్రయాణంలో డిసెంబరు 25, జనవరి ఒకటో తేదీల్లో కొల్లాంలో తెల్లవారుజామున 2.30కి బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. 

Also Read:  Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు!

ఈ రైలు ఏపీలోని.. మచిలీపట్నం, పెడన, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగనుంది.మౌలాలి-కొల్లాం (07143) ప్రత్యేక రైలు డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మౌలాలీలో మధ్యాహ్నం 11.30కు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కొల్లాం చేరుతుంది. ఈ రైలు (07144) తిరుగు ప్రయాణంలో డిసెంబరు 8, 15, 22, 29 తేదీల్లో కొల్లాంలో తెల్లవారుజామున 2.30కి బయలుదేరి రెండో రోజు ఉదయం 10 గంటలకు మౌలాలీ చేరుతుంది. 

Also Read: AP Rains: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం... ఆ రెండు రోజులు వానలే వానలు!

ఈ రైలుకి తెలంగాణలోని మౌలాలి, చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం రైల్వేస్టేషన్‌లలో స్టాప్‌ ఉంది. ఏపీలోని.. విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగనుంది. ఈ రైళ్లకు అడ్వాన్స్‌ బుకింగ్‌ బుధవారం ఉదయం 8 గంటల నుంచి మొదలు కానుందని అధికారులు తెలిపారు.

Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు