Viral Video: అంబులెన్స్‌కు దారివ్వలేదని రెండున్నర లక్షల ఫైన్‌

కేరళలోని చలకుడిలో త్రిసూర్ మెడికల్ కాలేజీకి వెళ్లే మార్గంలో అంబులెన్స్‌ను అడ్డుకున్నందుకు కారు యజమానికి రూ. 2.5 లక్షల జరిమానాను విధించారు. అంతేకాకుండా అతని లైసెన్స్‌ను కూడా పోలీసులు రద్దు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
ambulance

ambulance Kerala

Viral Video: అంబులెన్స్‌ను అడ్డుకున్నందుకు కారు యజమానికి రూ. 2.5 లక్షల జరిమానాను కేరళ పోలీసులు విధించారు. అంతేకాకుండా లైసెన్స్‌ కూడా రద్దు  చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలోని చలకుడిలో త్రిసూర్ మెడికల్ కాలేజీకి వెళ్లే మార్గంలో అంబులెన్స్ వెళ్తుంటే దానికి దారి ఇవ్వకుండా చాలా సేపటి వరకు అలాగే అడ్డుగా వెళ్లాడు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్‌కు ఓ వ్యక్తి కారును అడ్డుగా ఉంచి చాలా సేపటి వరకు దారి ఇవ్వలేదు.

లైసెన్స్‌ రద్దు:

అంబులెన్స్‌ డ్రైవర్‌ ఎంత హారన్‌ కొట్టినా పక్కకి తప్పుకోలేదు. పక్కకి జరిగేందుకు చోటు ఉన్నా కూడా మూర్ఖంగా అలాగే వెళ్లాడు. ఇదంతా అంబులెన్స్‌లో ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది. కీలక సాక్ష్యంగా మారిన ఈ ఫుటేజీతో కేరళలోని త్రిస్సూర్‌ పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. వ్యక్తి అడ్రస్‌ తెలుసుకుని ఇంటికి వెళ్లి మరీ రూ.2.5 లక్షల జరిమానా విధించారు. అంతేకాకుండా అతని లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 3.5 లక్షల వీక్షణలను సంపాదించిందించి. 

ఇది కూడా చదవండి: నిజామాబాద్‌లో హైటెన్షన్.. మేయర్ భర్తపై సుత్తెతో దాడి!

అంతేకాకుండా ఆన్‌లైన్‌లో ఒక చర్చకు దారి తీసింది. అధికారులు తీసుకున్న సత్వర చర్యను పలువురు ప్రశంసించారు. అంబులెన్స్ పట్ల కారు డ్రైవర్ నిర్లక్ష్యం చేయడాన్ని ఖండిస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహితమైన డ్రైవింగ్ వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది భారీ జరిమానాను సమర్థించగా, కొందరు మరింత అవగాహన అవసరమని సూచిస్తున్నారు. డ్రైవర్లకు మొదటి నుంచి అవగాహన కల్పించాలని అంటున్నారు. రోడ్లపై ప్రజల భద్రతను నిర్ధారించడానికి ఇలాంటి కఠినమైన చర్యలు అవసరమని మరికొందరు నొక్కిచెప్పారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా రహదారి భద్రతా నియమాలను మరింత కఠినంగా అమలు చేయాలని గుర్తుచేస్తోంది. కేరళ పోలీసుల నిర్ణయాత్మక చర్యను పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో కన్నీరు పెట్టించే ఘటన.. గ్రూప్-3 ఎగ్జామ్ రాసి వస్తున్న తల్లి వైపు పరిగెత్తుతూ..!

 

 

Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

 

Also Read:  Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!

Advertisment
Advertisment
తాజా కథనాలు