జనవరిలో దావోస్‌కు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే జనవరి 20 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు వెళ్లనున్నారు.

New Update
chandrababu

CM Chandrababu: సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే జనవరి 20 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో దావోస్ లో ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికారుల ఏపీ నుంచి దావోస్ కు వెళ్లారు. ఏపీ ఈడీబీ సీఈఓ సి.ఎం.సాయికాంత్‌ వర్మ, ఏపీఐఐసీ ఎండీ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ నిన్న దావోస్‌ వెళ్లారు. అయితే..  పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఈరోజు బయలుదేరనున్నారు. అధికారుల బృందం ఈ నెల 22 వరకు దావోస్‌లో ఉండనుంది.

ఇది కూడా చదవండి: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్

రూ.వేల కోట్ల పెట్టుబడులు..

దావోస్‌ సదస్సులో ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను అధికారుల బృందం ఎంపిక చేయనుంది. WEF సదస్సు సందర్భంగా అక్కడ ఏపీ ప్రతినిధులకు అవసరమైన సహకారం, ఏర్పాట్లపై దావోస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. ‘షేపింగ్‌ ద ఇంటెలిజెంట్‌ ఏజ్‌’ అనే థీమ్‌తో వచ్చే సంవత్సరం జనవరిలో డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలు నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు హాజరయ్యే దావోస్‌ సదస్సుకు 2014-19 మధ్య ఆనాడు అధికారంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి ప్రతినిధుల బృందం హాజరైన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు సారథ్యం వహించేవారు. కాగా ఆ సమయంలో 2014-19 మధ్య దావోస్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ చర్చలు ఫలించి తర్వాత కూడా పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

ఇది కూడా చదవండి: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

ఇది కూడా చదవండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

Advertisment
తాజా కథనాలు