Telangana: తెలంగాణ ప్రజలు తినే తిండి డేంజర్.. వాళ్లు చేస్తున్న తప్పు ఇదే.. ICMR షాకింగ్ రిపోర్ట్!

తెలంగాణలో మాత్రం బ్యాలెన్స్ డైట్ పాటించడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. శరీరానికి స్తోమతను ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవడం లేదని తెలిపింది. తెలంగాణ ప్రజలు తినే తిండిలో దాదాపుగా 67 శాతం అన్నమే ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది.

New Update
telangana

Telangana

ప్రొటీన్, పోషకాలు, విటమిన్లు అధిక మొత్తంలో ఉండే ఫుడ్స్ తీసుకుంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు(health-problems) రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. డైట్ ఎంత బ్యాలెన్స్‌గా ఉంటే ఆరోగ్యం కూడా అంతే బ్యాలెన్స్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో మాత్రం బ్యాలెన్స్ డైట్(unhealthy-foods) పాటించడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. శరీరానికి శక్తిని ఇచ్చే పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం లేదని తెలిపింది. ఎక్కువగా పిండి పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నారని, వీటివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం లేదని సర్వేలో తేలింది.

ఇది కూడా చూడండి: Amazon, Flipkart sale: ఐఫోన్లు 'Out of stock' కాకుండా ఉండటానికి 5 సింపుల్ ట్రిక్స్!

అన్నమే ఎక్కువ మంది తీసుకుంటారని..

తెలంగాణ ప్రజలు తినే తిండిలో దాదాపుగా 67 శాతం అన్నమే(rice) ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ఐసీఎంఆర్(icmr) దేశ వ్యాప్తంగా 1.24 లక్షల మంది వివరాలను సేకరించింది. ఇందులో రోజుకు 2 వేల క్యాలరీల ఫుడ్స్ తీసుకోవాలి. అందులో 50 శాతం లోపు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కానీ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే కేవలం 70 శాతం కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని తేలింది. 25 శాతం కంటే ఎక్కువగా కొవ్వు తీసుకుంటున్నారని తెలిపింది. ప్రొటీన్లు, విటమిన్లు, పండ్లు వంటివి తీసుకోవడం లేదని తాజా అధ్యయనాల్లో తేలింది. జొన్న రొట్టె, గోధుమ రొట్టె వంటివి తీసుకుంటున్నా ఎలాంటి ఫలితాలు లేవని వెల్లడించింది. పప్పులు తక్కువగా తినడంతో పాటు చికెన్ ఎక్కువగా తింటున్నారని తెలిపింది. 

ఇది కూడా చూడండి: Weight loss Tips: డైలీ ఈ టిప్స్ పాటిస్తే.. నెల రోజుల్లో హెవీ వెయిట్ లాస్.. ఎలాగంటే?

అన్నం ఎక్కువగా తింటున్న రాష్ట్రాల జాబితాలో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయని ఈ రిపోర్ట్ తెలిపింది. కొన్ని రాష్ట్రాలు 99 శాతం అన్నమే తింటున్నాయి. మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జొన్నలు, సజ్జలు తీసుకుంటున్నా.. డైట్ ఏం మారడం లేదని అధ్యయనాల్లో తేలింది. ఇలా బ్యాలెన్స్ లేని డైట్ తీసుకోవడం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్‌లో ఎలాంటి పోషకాలు లేకపోవడం వల్ల షుగర్, గుండె జబ్బులు, ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ హెచ్చరించింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 68 శాతం గుండె, షుగర్ సంబంధిత వ్యాధులు వలన వస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. వీటితో పాటు మద్యం, ధూమపానం వంటివి తీసుకుంటున్నారు. వీటివల్ల కూడా హెల్త్ బ్యాలెన్స్ అవుతుందని హెచ్చరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు