Rahane: సెంచరీ చేసినా జట్టునుంచి తప్పించారు.. అంతా వాళ్ల చేతుల్లోనే: బాంబ్ పేల్చిన రహానే!

భారత జట్టులో చోటు కోల్పోవడంపై అజింక్యా రహానే సంచలన కామెంట్స్ చేశాడు. నిలకడగా రాణించినప్పటికీ అనూహ్యంగా జట్టునుంచి ఎందుకు తప్పించారో తనకు అర్థం కాలేదన్నాడు. 2023 WTC ఫైనల్‌లో సెంచరీ చేసినా ఆ తర్వాత ఎందుకు సెలెక్ట్ చేయలేదో సెలక్టర్లకే తెలుసన్నాడు.

New Update
rahane

rahane Photograph: (rahane)

Rahane: భారత జట్టులో చోటు కోల్పోవడంపై అజింక్యా రహానే సంచలన కామెంట్స్ చేశాడు. నిలకడగా రాణించినప్పటికీ అనూహ్యంగా జట్టునుంచి ఎందుకు తప్పించారో తనకు అర్థం కాలేదన్నాడు. మిడిలార్డర్‌లో ఛెతేశ్వర్‌ పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన తాను.. ఆసీస్‌ పర్యటనలో తాత్కాలిక కెప్టెన్‌గా టెస్టు విజయాన్ని అందించినట్లు గుర్తు చేశాడు. 

సెంచరీ చేసినా గుర్తించలేదు..

అంతేకాదు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2023 సీజన్‌ ఫైనల్‌లోనూ సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ఆ తర్వాత టీమ్ లో చోటు లభించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రహానే.. సెంచరీతో జట్టును సెమీస్‌కు చేర్చాడు. మొత్త ఈ టోర్నీ 10 మ్యాచుల్లో ఒక సెంచరీ, మూడుసార్లు 90+, ఒకసారి 80+ రన్స్ చేసి మళ్లీ టెస్టు జట్టులోకి రావాలనే కసితో రాణిస్తున్నాడు. 

ఇది కూడా చదవండి: Bird flu: పెరిగిన బర్డ్ ఫ్లూ.. ఒక్కరోజే 40 లక్షల కోళ్లు ఖతం.. చికెన్ సెంటర్లకు రూ. 25వేల జరిమానా!

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంజిక్యా.. ‘ప్రస్తుతం బాగా రానిస్తున్నా. నా బ్యాటింగ్‌పై సంతృప్తిగా ఉన్నా. ముస్తాక్ అలీ ట్రోఫీతోపాటు రంజీ మ్యాచుల్లోనూ రన్స్ చేయడం సంతోషంగా ఉంది. భారత జట్టులోకి తిరిగొస్తాననే నమ్మకం ఉంది. కానీ అది నా చేతుల్లో లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో బాగానే ఆడినా జట్టునుంచి తప్పించారు. ఎందుకు సెలెక్ట్ చేయట్లేదో తెలీదు. అది సెలక్టర్లకే వదిలేస్తున్నా. ఎల్లప్పుడు ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనే చూస్తున్నా. జాతీయజట్టుకు ఆడే అవకాశం లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆదరించింది. దేశవాళీ క్రికెట్ కోసం ఏం చేయడానికైనా రెడీ. ఆటపై చాలా ప్రేమ ఉంది. టెస్టు క్రికెట్‌ అంటే ఎంతో గౌరవం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. నాలో ఇంకా క్రికెట్‌ మిగిలి ఉంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌కు పిలుపొస్తుందని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: తెలంగాణలో మళ్లీ కులగణన.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు