/rtv/media/media_files/2025/02/12/Nj7cVHGphYvcmoRr3eBl.jpg)
elon musk son X Photograph: (elon musk son X)
ఎలన్ మస్క్ చిన్న కొడుకు తండ్రితోపాటు మంగళవారం వైట్‌హౌస్‌కు వచ్చాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌ను పునర్నిర్మించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నప్పుడు మస్క్ హాజరైయ్యాడు. ఎలోన్ మస్క్ చిన్న కుమారుడు ఎక్స్ చేసిన పనికి అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమావేశం మధ్యలో ఎక్స్ తండ్రి భుజాలపైకి ఎక్కి కూర్చొని సందడి చేశాడు. ఆ కుర్రాడు ఎలన్ మస్క్ మాట్లాడే విధానాన్ని ఇమిటేట్ చేస్తూ.. విలేకరులను నవ్వించాడు. దీంతో ఎక్స్ వీడియోలు ఇప్పుడు ఎక్స్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. ఎలన్ మస్క్ కు ఏడుగురు సంతానం, ముగ్గురు భార్యలు ఉన్నారు.
🇺🇸 "The American bureaucracy is the fourth and unelected branch of government"
— Lord Bebo (@MyLordBebo) February 12, 2025
— Musk criticized the US federal structures during a meeting with Trump at the White House. pic.twitter.com/lP8YhKyKwL
నెటిజన్లు ఆ పిల్లవాడిని అలా చూసి తెగ నవ్వుతున్నారు. ఈ వీడియో చూసినవారు అలాంటి తండ్రి ఉండటం అతని అదృష్టమని కామెంట్ చేస్తున్నారు. గొప్ప పిల్లాడు, మంచి జ్ఞాపకశక్తి ఉన్న బాయ్ అని ట్రంప్ ఎక్స్ ను ప్రసంశించాడు. ట్రంప్‌తో లిటిల్ ఎక్స్ ఉన్న ఫోటోను, తన కొడుకుతో జాన్ ఎఫ్ కెనడి ఉన్న పాత చిత్రంతో పోల్చిన పోస్ట్‌ను మస్క్ తిరిగి షేర్ చేశాడు.
— Elon Musk (@elonmusk) February 12, 2025
కొత్తగా స్థాపించబడిన ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE)తో ఫెడరల్ ఏజెన్సీలు సహకరించాలని ఆదేశించాడు ట్రంప్. ఆ విభాగానికి మస్క్ ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నాడు. ఫెడరల్ వర్క్‌ఫోర్స్ సంఖ్య తగ్గించాలని ఈ మీటింగ్‌లో మాట్లాడుకున్నారు.