/rtv/media/media_files/2025/11/05/jaggery-tea-2025-11-05-16-17-39.jpg)
Jaggery Tea
శీతాకాలం ప్రారంభం కాగానే చల్లదనం పెరగడం.. అదే సమయంలో వేడి వేడి టీ తాగాలనే కోరిక కూడా పెరుగుతుంది. ఈ చలిలో బెల్లం టీ (Jaggery Tea) తాగడం వల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లంలో శరీరానికి వేడినిచ్చే గుణాలు, జీర్ణశక్తిని మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయి. అయితే.. బెల్లం టీ తయారుచేసేటప్పుడు చాలా మందికి ఉండే పెద్ద సమస్య ఏంటంటే.. టీలో బెల్లం కలపగానే విరిగిపోవడం (Curdling). బెల్లం టీ విరిగిపోకుండా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో.. దాని ప్రయోజనాలేమిటో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
బెల్లం టీ ఎందుకు విరిగిపోతుంది:
బెల్లం టీ విరిగిపోవడానికి ప్రధాన కారణం.. బెల్లం, పాల మధ్య ఉష్ణోగ్రత తేడా, ఆమ్ల-క్షార ప్రతిచర్య (Acid-Base Reaction). పాలను వేడి టీ మిశ్రమానికి లేదా బెల్లానికి కలిపినప్పుడు.. ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా పాలు త్వరగా విరిగిపోతాయి. బెల్లం టీ విరిగిపోకుండా తయారు చేసే విధానం (Jaggery Tea Recipe). 99% మందికి తెలియని ఈ సరైన పద్ధతిని పాటిస్తే.. మీ టీ ఎప్పటికీ విరిగిపోదు. బెల్లాన్ని నీటిలో మాత్రమే కరిగించాలి. ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు వేడి చేయాలి. నీరు మరుగుతున్నప్పుడు.. మూడు చిన్న బెల్లం ముక్కలను వేయాలి. బెల్లాన్ని ఎల్లప్పుడూ వేడి నీటిలో మాత్రమే కరిగించాలి.
ఇది కూడా చదవండి: ఎక్కువ కాలం బతకాలని ఉందా..? అయితే.. వెంటనే ఈ 10 అలవాట్లు మార్చుకోండి!!
ఇలా చేయడం వల్ల టీ విరిగిపోకుండా ఉంటుంది. బెల్లం కరుగుతుండగా, అల్లం, యాలకులు, ఒక లవంగాన్ని కొద్దిగా దంచాలి. రుచి కోసం కొద్దిగా నల్ల మిరియాలు లేదా సోంపు కూడా కలపవచ్చు. ఈ మసాలా దినుసులను మరుగుతున్న నీటిలో వేయాలి.. తద్వారా వాటి సువాసన, రుచి నీటిలో బాగా ఇంకుతాయి. ఆ తరువాత రెండు టీస్పూన్ల టీపొడిని కలపాలి. స్ట్రాంగ్‌గా కావాలంటే టీపొడి పరిమాణం కొద్దిగా పెంచవచ్చు. మరో గిన్నెలో ఒకటిన్నర కప్పు పాలు వేడి చేయాలి ఇప్పుడు మరుగుతున్న టీ మిశ్రమంలో ఈ వేడి పాలను కలిపి.. 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. తయారు చేసిన రుచికరమైన, సువాసనభరితమైన, ఏమాత్రం విరిగిపోని బెల్లం టీ సిద్ధం అవుతుంది. బెల్లం టీ రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శీతాకాలంలో శరీరానికి శక్తిని అందిస్తుంది. అల్లం, యాలకుల కలయిక దాని ప్రయోజనాలను మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: స్త్రీలు లోదుస్తులను నెల రోజులు ధరించకుంటే లాభమా లేక నష్టమా..?
Follow Us