/rtv/media/media_files/2025/05/28/nvCFxWdoHN6PErVzDGfX.jpg)
Vastu Tips
Vastu Tips: నేటి కాలంలో ప్రతి వ్యక్తి ఇంట్లో ఆనందం, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలంటే డబ్బుకు కొరత ఉండకూడదు. కొన్నిసార్లు మనం చేసే కష్టానికి తగ్గ ఫలితాలు లభించవు. డబ్బు కొరత, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం ఉండదు. ఆ సమయంలో వాస్తు శాస్త్రాన్ని ఆశ్రయిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోని ప్రతి మూలకు దాని స్వంత ప్రత్యేక శక్తి ఉంటుంది. అది జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అది మెట్ల ప్రాంతమైనా సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాలున్నాయి. దీనిని ద్వారా ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఎంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Also Read : టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు
కర్పూరంతో ఆర్థిక లాభాలు:
కర్పూరం పవిత్రమైనదిగా చెబుతారు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాప్తిని తొలగిస్తుంది. కానీ కర్పూరాన్ని కాల్చకుండా మెట్ల కింద శుభ్రమైన ప్రదేశంలో ఉంచితే.. అది అంతే ప్రభావవంతంగా ఉంటుంది. మెట్ల కింద ఉన్న ప్రాంతం మూసి వేసి చీకటిగా ఉంటే ప్రతికూల శక్తి త్వరగా పేరుకుపోతుంది. కర్పూరం ఈ స్తబ్ద శక్తిని విచ్ఛిన్నం చేసి అక్కడ స్వచ్ఛమైన, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. కర్పూరం మెట్ల కింద ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. ఖజానా ఖాళీగా ఉండదు, ఆర్థిక సంక్షోభం, అప్పుల్లో చిక్కుకునే వారికి, మనస్సును ప్రశాంత, మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. కర్పూరంతో మనస్సు, ఒత్తిడి లేకుండా, శారీరకంగా మెరుగ్గా ఉంటారు. ఇల్లు కట్టేటప్పుడు కొన్ని చిన్న తప్పులు వాస్తు దోషాలకు కారణమవుతాయి. ఈ దోషాలను శాంత పరచడంలో కర్పూరం సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: పిల్లలకు కరోనా వస్తే.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?
కర్పూరం ప్రభావం వల్ల ఇంటి వాతావరణంలో ప్రశాంతత, ఆలోచనా, అవగాహన శక్తి పెరుగుతుంది. ముందుగా మెట్ల కింద ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. ఒక చిన్న గిన్నెలో కర్పూరం వేసి మెట్ల కింద సురక్షితమైన మూలలో ఉంచాలి. కర్పూరం సువాసన అలాగే ఉండేలా ప్రతి 7-10 రోజులకు ఒకసారి మార్చాలి. ఇంట్లో పాత కర్పూరం చెట్టు కింద ఉంచాలి. చెత్త, పాత బూట్లు, చెప్పులు, పనికిరాని వస్తువులను మెట్ల కింద ఎప్పుడూ ఉంచవద్దు. ఇది సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. కర్పూరం పిల్లలకు, జంతువులకు అందుబాటులో లేకుండా ఉంచాలి. మెట్ల కింద టాయిలెట్, బాత్రూమ్ ఉంటే.. ఈ పరిష్కారాన్ని ప్రయత్నించవద్దు. ఈ చిన్న పరిష్కారం ఇంటి వాతావరణాన్ని మార్చగలదు. ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఉద్రిక్తత ఉంటే ఈ సులభమైన పరిష్కారాన్ని చేయాలని జోతిష్యులు చెబుతున్నారు.
Also Read : Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే..7 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
(Vastu Tips | new-home-vastu-tips | latest-news | telugu-news | home-tips | home tips in telugu)