/rtv/media/media_files/2025/09/04/walking-in-mud-2025-09-04-14-41-50.jpg)
walking in mud
చిటపట చినుకులు పడుతున్నప్పుడు.. ఇంటి ముందు మట్టి రోడ్డు గుండా నడిస్తే ఎంత మధురమైన అనుభూతి కలుగుతుంది. కానీ వర్షాలు వెలిశాక మాత్రం ఆ మట్టి బురదగా మారి మన పాదాలను అంటి పెట్టుకుంటుంది. వర్షాకాలం అందంగా ఉంటుంది. కానీ దానితోపాటు ఈ బురద సమస్య కూడా వస్తుంది. చెప్పులు జారిపోవడం, బట్టలకు అంటుకోవడం, వాహనాలు ముందుకు కదల్లేకపోవడం లాంటి సమస్యలను మనం ఎదుర్కొంటాం. ఈ బురద కొన్నిసార్లు కష్టంగా అనిపించినా.. వర్షాల పులకింతలో ఇది ఒక భాగం అని చెప్పవచ్చు. ఈ బురద మన జీవితంలో ఒక భాగమైపోయింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షపు నీరు, బురద నిండిన రోడ్లపై ప్రయాణించడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగి, బురదమయంగా మారాయి. ఈ బురదలో నడవడం వలన చర్మ సంబంధిత, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు కారణం..
బురదలో ఉండే బ్యాక్టీరియా, క్రిములు చర్మంపై ఉన్న గాయాలు లేదా చిన్న కోతల ద్వారా శరీరంలోకి ప్రవేశించి, ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. స్టెఫిలోకాకస్ (Staphylococcus) మరియు స్ట్రెప్టోకాకస్ (Streptococcus) వంటి బ్యాక్టీరియాలు చర్మ ఇన్ఫెక్షన్లను కలిగించవచ్చు. అదేవిధంగా ఈ. కోలి (E. coli) మరియు సాల్మొనెల్లా (Salmonella) వంటి సూక్ష్మజీవులు కడుపు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. దీని వలన విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా బురదలో ఉండే బ్యాక్టీరియా ద్వారా లెప్టోస్పైరోసిస్ (Leptospirosis) అనే తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా వ్యాపించవచ్చు. దీని లక్షణాలు జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పిగా ఉంటాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ 3 లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే.. వారు ఒక మేధావి అని అర్థం!
బురదలో ఉండే బ్యాక్టీరియా నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశించి, తీవ్రమైన జ్వరానికి, అంతర్గత ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని హెచ్చరించారు. అందువల్ల బురదలో నడవడం తప్పనిసరి అయితే నీరు చొరబడని బూట్లు, చేతి తొడుగులు ధరించాలని ఆయన సూచించారు. బురదలో నడిచిన తర్వాత వెంటనే చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మంపై గాయాలు లేదా కోతలు ఉంటే.. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం.. వీలైనంత త్వరగా వైద్య సహాయం పొందడం ముఖ్యం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో తలెత్తే ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇది కేవలం సమాచారం మాత్రమే.. ఏమైనా చర్మ సమస్యలు ఉంటే వైద్య సలహా కోసం మంచి డాక్టర్‌ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:తరచుగా మూత్రం వస్తుందా..? అయితే.. మీకు ఆ డేంజర్ వ్యాధి ముప్పు ఉన్నట్లే..!!