/rtv/media/media_files/2025/06/12/UK68u059uZdk8hs2AZP2.jpg)
Pomegranate Leaves Tea
Pomegranate Leaves Tea: నేటి కాలంలో టీ అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. రోజూ 2,3 సార్లు తీసుకుంటారు. మరికొందరూ రుచికరమైన దానిమ్మ గింజలను ఆస్వాదిస్తారు. కానీ దానిమ్మ ఆకులతో తయారు చేసిన టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఈ టీ రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా పని చేస్తుంది. దానిమ్మ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. దానిమ్మ ఆకు టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
దానిమ్మ ఆకు టీ ప్రయోజనాలు
దానిమ్మ ఆకులు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ టీ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని రెగ్యులర్ వాడకం చర్మాన్ని మెరుగుపరుస్తుంది, మొటిమల సమస్యను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
టీ తయారీ విధానం:
5-6 తాజా దానిమ్మ ఆకులు, 1.5 కప్పుల నీరు, రుచికి తేనె లేదా నిమ్మకాయ అవసరం ఉంటుంది. ముందుగా దానిమ్మ ఆకులను బాగా కడగాలి. ఒక పాన్ లో 1.5 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు.. దానిమ్మ ఆకులను అందులో వేయాలి. సుమారు 5-7 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి. గ్యాస్ ఆపివేసి టీని వడకట్టాలి. రుచికి అనుగుణంగా తేనె, నిమ్మకాయను కలపవచ్చు. వేడి టీని ఆస్వాదించండి. ఈ టీ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ టీని రోజుకు ఒకసారి తాగితే సరిపోతుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే.. తప్పకుండా వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: జామున్ తింటే శరీరంలో ఏం జరుగుతుంది? ప్రయోజనాలున్నాయా?
( health tips in telugu | latest health tips | best-health-tips | Latest News )