/rtv/media/media_files/2025/10/07/diwali-and-goddess-lakshmi-2025-10-07-10-41-05.jpg)
Goddess Lakshmi
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంగా కార్తీక మాసం(Kartik Maas 2025) చెబుతారు. ఈ మాసంలో నాలుగు నెలల యోగ నిద్ర తర్వాత శ్రీమహావిష్ణువు మేల్కొంటారని ప్రగాఢ విశ్వాసం. ఈ కారణంగా.. కార్తీక మాసంలో ఆచరించే ప్రతి ధార్మిక కార్యానికి విశేష ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 2025 సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ 8 నుంచి నవంబర్ 5 వరకు (లేదా నవంబర్ 6) కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ పవిత్ర మాసంలో లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన 10 ప్రత్యేక కార్యాలు ఉన్నాయి. వాటి గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Also Read : ఈ పౌడర్ వేసి కడిగితే బాత్రూమ్ మిలమిలా మెరిసిపోతుంది
కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్య కార్యాలు:
బ్రహ్మ ముహూర్తంలో స్నానం: కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానాదికాలు పూర్తి చేసి దామోదర అష్టకం పఠించాలి. అలాగే శ్రీహరి నామాలను జపించి తులసి మొక్క చుట్టూ నాలుగు సార్లు ప్రదక్షిణ చేయాలి.
తులసి పూజ, దీపారాధన: శ్రీహరికి తులసి అంటే ఎంతో ప్రీతి. కాబట్టి ఈ మాసంలో తులసి మొక్కకు ప్రతిరోజూ దీపం పెట్టడంతోపాటు దానికి సేవ చేయాలి
దీపదానం, ఆలయ దర్శనం:కార్తీక మాసంలో ఠాకూర్ జీ (శ్రీకృష్ణుడు/శ్రీమహావిష్ణువు)కి దీపదానం చేసి.. తులసి హారతి ఇవ్వాలి. ప్రతిరోజూ వీలైనంత వరకు దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి.
పవిత్ర గ్రంథాల పఠనం/శ్రవణం:ఈ మాసంలో వైష్ణవ గ్రంథాలను పఠించడం (చదవడం) లేదా శ్రవణం (వినడం) చేయడం చాలా శ్రేయస్కరం.
బృందావన దర్శనం, కీర్తన: అవకాశం ఉంటే కార్తీక మాసంలో బృందావనం వెళ్లి ఠాకూర్ జీ దర్శనం చేసుకోవాలి. రోజుకు కనీసం అరగంట పాటు భక్తి కీర్తనలు చేయాలి.
మౌన చింతన, జీవసేవ:కార్తీక మాసంలో మౌనంగా ఉండి.. భగవంతుడిని ధ్యానించడం వలన దైవ కృప లభిస్తుంది.
గోసేవ సేవ:శ్రీహరికి జీవజంతువులంటే కూడా ఎంతో ఇష్టం. కాబట్టి ఆవుకు రొట్టె ఇవ్వడం, ఇతర మూగజీవాలకు సేవ చేయడం ద్వారా కూడా భగవత్ అనుగ్రహం లభిస్తుంది. ఈ పనులను భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా భక్తులకు లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువుల ప్రత్యేక ఆశీస్సులు లభించి.. జీవితంలో సుఖ సంతోషాలు, సంపద కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చేసిన పుణ్యకార్యాలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని ప్రతీతి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: రాగి పాత్రలు, నల్ల జుట్టుకు సంబంధం ఏంటో తెలుసా..?
Follow Us