/rtv/media/media_files/2025/10/15/foot-odor-removal-2025-10-15-07-47-26.jpg)
Bad Feet removal
పాదాల వాసన లేదా బ్రోమోడోసిస్ చాలా సాధారణమైన సమస్య. మూసి ఉన్న బూట్లు ధరించినప్పుడు, వేడి, తేమతో కూడిన వాతావరణం బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఫలితంగా దుర్వాసన వస్తుంది. పాదాల పరిశుభ్రతపై శ్రద్ధ వహించకపోతే ఈ సమస్య చలికాలంలో కూడా వేధించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను నివారించడానికి ప్రతిరోజూ శుభ్రమైన సాక్స్ ధరించడం, బూట్లను తరచుగా ఉతకడం, పాదాల చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం వంటి ప్రాథమిక చర్యలు తీసుకోవాలి. అయితే.. కొన్ని సహజమైన ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
సులభమైన చిట్కాలతో తక్షణ ఉపశమనం:
ఒక టీస్పూన్ సాధారణ ఉప్పు, అర టీస్పూన్ పటికను గోరు వెచ్చని నీటిలో కలిపి15-20 నిమిషాలు పాదాలను నానబెట్టాలి. పటికకు యాంటీసెప్టిక్ గుణాలు ఉండడం వలన బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది, ఉప్పు చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీనిని వారానికి 3-4 సార్లు చేయవచ్చు. అంతే కాండా గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపి 15 నిమిషాలు పాదాలను నానబెట్టండి. బేకింగ్ సోడా pH స్థాయిని సమతుల్యం చేసి బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. దీనిని చిన్న సంచులలో కట్టి రాత్రిపూట బూట్లలో ఉంచడం లేదా నేరుగా చల్లడం ద్వారా కూడా బూట్ల దుర్వాసనను తొలగించవచ్చు.
ఇది కూడా చదవండి: పార్కిన్సన్ వ్యాధి నాడి పట్టేసిన శాస్త్రవేత్తలు.. ఎలానో మీరూ తెలుసుకోండి!!
వేప నూనెకు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రం చేసి, వేప నూనెను వేళ్లు, అరికాళ్ళు, మడమల మధ్య రాసి 15-20 నిమిషాలు ఉంచాలి. ఇది వాసనను తొలగించడమే కాక.. ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. టీ ట్రీ ఆయిల్ యొక్క యాంటీ మైక్రోబయల్, యాంటీ సెప్టిక్ గుణాలు పాదాల వాసనకు అద్భుతమైన చికిత్సగా పనిచేస్తాయి. ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో 1-2 చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి పాదాలకు మసాజ్ చేయాలి. దీన్ని రోజుకు ఒకసారి వాడితే పాదాల దుర్వాసన తగ్గుతుంది. బూట్ల లోపల తేలికగా స్ప్రే చేయడం కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే.. ఆరోగ్య సమస్యలకు వైద్య సలహా తీసుకోవాలని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: బ్రెయిన్ డెడ్ వ్యక్తిలోని ఏ శరీర భాగాలు దానం చేయొచ్చో తెలుసుకోండి!!