Heart Attack Tips: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. మరికొద్ది సేపట్లో గుండెపోటు రావడం పక్కా..!

గుండెపోటు అకస్మాత్తుగా వచ్చినా.. దాని ముందస్తు లక్షణాలను ముందు నుంచే చూపిస్తుంది. ఛాతీలో అసౌకర్యం, ఎడమ చేయి, దవడ లేదా పళ్లకు నొప్పి, శ్వాస ఆడకపోవడం, అకస్మాత్తుగా చెమట పట్టడం వంటివి గంటల లేదా రోజుల ముందు శరీరం సంకేతాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Heart Attack

Heart Attack

గత కొన్ని సంవత్సరాలుగా గుండెపోటు (Heart Attack) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో, మీడియాలో చూస్తున్నట్లుగా.. ఒక వ్యక్తి కూర్చుని, తింటూ, ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతుండడం చూస్తున్నాం. సమయానికి చికిత్స అందకపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందా..? శరీరం ముందుగా ఎటువంటి హెచ్చరిక సంకేతాలు ఇవ్వదా..? అనే ప్రశ్నలు మదిలో తలెత్తుతాయి. నిజానికి గుండెపోటు అకస్మాత్తుగా వచ్చినా.. దాని ముందస్తు లక్షణాలను శరీరం కొన్ని గంటల ముందు లేదా కొద్ది రోజుల ముందు నుంచే చూపడం ప్రారంభిస్తుంది. ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సంకేతాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

గుండెపోటుకు ముందు శరీరం ఇచ్చే సంకేతాలు:

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండెపోటుకు కొద్ది గంటల ముందు లేదా రోజుల ముందు శరీరం అనేక హెచ్చరిక సంకేతాలను ఇవ్వవచ్చు. వీటిలో ముఖ్యమైనవి. ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి (Chest Discomfort). గుండెపోటుకు అత్యంత సాధారణ సంకేతం ఛాతీలో ఒత్తిడి లేదా బరువుగా అనిపించడం. తర్వాత నొప్పి వ్యాప్తిగా ఉంటుంది. ఈ నొప్పి కొన్నిసార్లు ఎడమ చేయి, వీపు, మెడ, దవడ లేదా పళ్లకు కూడా వ్యాపించవచ్చు. అంతేకాకుండా శ్వాస ఆడకపోవడం (Shortness of Breath) కూడా ఒకటి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి ఉంటాయి. ఇంకా అకస్మాత్తుగా చెమట పట్టడం కూడా ఉంటుంది. చల్లటి చెమటలు (Cold Sweats) పట్టడం, వికారం (Nausea), మైకం (Dizziness) వంటివి ఇతర హెచ్చరిక సంకేతాలు ఉంటాయి. అసాధారణ అలసట (Unusual Fatigue). చాలా మంది రోగులు, ముఖ్యంగా మహిళలు, గుండెపోటుకు ముందు ఎటువంటి కారణం లేకుండానే విపరీతమైన బలహీనత, అలసటను అనుభవిస్తారని నిపుణులు చెబుతున్నారు. 

 ఇది కూడా చదవండి: కనురెప్పల అందం కోసం ఐదు అద్భుతమైన ఇంటి చిట్కాలు మీకోసం..!!

గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనులు (Coronary Arteries) అడ్డంకికి గురైనప్పుడు గుండెపోటు వస్తుంది. ఈ అడ్డంకి సాధారణంగా కొలెస్ట్రాల్ ఫలకం (Cholesterol Plaque), కొవ్వు నిల్వలు, రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడుతుంది. రక్త ప్రవాహం నిలిచిపోయినప్పుడు, గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి గుండెపోటుకు దారితీస్తుంది. గుండెపోటును నివారించడానికి..ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా ధూమపానం, ఆల్కహాల్ సేవించడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి గుండెపోటుకు ప్రధాన కారణాలు. ఈ ముందస్తు లక్షణాలను తెలుసుకుని.. తగిన చర్యలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: పాలల్లో ఇది కలుపుకొని తాగితే మంచి నిద్రొస్తుందని తెలుసా.?

Advertisment
తాజా కథనాలు