Health Tips: దోమను చంపిన తర్వాత చేతులు కడగకపోతే డేంజర్.. ఏమవుతుందో తెలుసా?

దోమను అరచేతితో చంపినప్పుడు.. దాని శరీరం పగిలిపోయి అందులోని సూక్ష్మక్రిములు చర్మానికి అంటుకుంటాయి. ఆ సమయంలో చేతులకు ఏ చిన్న కోత లేదా గీత ఉన్నా.. ఈ సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
mosquito

mosquito

మన చుట్టూ దోమల ఉనికి సర్వసాధారణం. ఇంట్లో, ఆఫీస్‌లో లేదా పార్క్‌లో దోమ కనిపించగానే వెంటనే చేతితో చంపేయడం చాలా మందికి అలవాటు. కానీ అరచేతితో దోమను చంపిన తర్వాత చేతులు కడుక్కోకపోతే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ చిన్న నిర్లక్ష్యం కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరం కావొచ్చు. దోమ అనేది కేవలం రక్తం పీల్చే కీటకం మాత్రమే కాదు.. అనేక ప్రమాదకరమైన వ్యాధులకు వాహకం అని ముందుగా అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  దోమను చంపాక చేతులు కడుకోతే  ఎలాంటి వ్యాధులు వస్తాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

చిన్న పొరపాటు...పెద్ద ప్రమాదం:

దోమ శరీరం, కాళ్లపై బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు (Parasites) ఉండవచ్చు. దోమను అరచేతితో చంపినప్పుడు.. దాని శరీరం పగిలిపోయి అందులోని సూక్ష్మక్రిములు చర్మానికి అంటుకుంటాయి. ఆ సమయంలో చేతులకు ఏ చిన్న కోత లేదా గీత ఉన్నా.. ఈ సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. అంతేకాదు దోమ రక్తం, దాని శరీరం అవశేషాలు అరచేతిపై మిగిలి ఉంటే.. అది అలెర్జీలు, దురద, ఎర్రటి దద్దుర్లు వంటి చర్మ సమస్యలను కూడా కలిగిస్తుంది. కొంతమందికి తేలికపాటి ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. చేతులు కడుక్కోకుండా తర్వాత ఆహారం తిన్నా, ముఖాన్ని తాకినా.. ఈ క్రిములు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. దీని వలన కడుపు నొప్పి, వాంతులు, అతిసారం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 ఇది కూడా చదవండి: దుప్పటి కప్పుకొని నిద్రపోవడం గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసా..?

దోమల ద్వారా వచ్చే వ్యాధులలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, జికా వైరస్ వంటి తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. చనిపోయిన దోమను తాకడం ద్వారా ఈ వ్యాధులు నేరుగా వ్యాపించనప్పటికీ.. దోమ ఏదైనా సోకిన వ్యక్తిని కుట్టి ఉంటే.. ఆ వైరస్ దాని అవశేషాలలో ఉండే అవకాశం ఉంది. అందుకే దోమను చంపిన తర్వాత తప్పకుండా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. దోమలను చేతులతో చంపడం కంటే టిష్యూ పేపర్, న్యూస్‌పేపర్, దోమలను చంపే సాధనాన్ని (Mosquito-killing tool) ఉపయోగించడం మంచిది. ఇలా చేయడం వలన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. పడుకునేటప్పుడు ఎల్లప్పుడూ దోమతెరను ఉపయోగించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటూ పరిశుభ్రతను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డలు తింటే ఎంత డేంజరో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు