Cinnamon: శీతాకాలంలో ఈ మసాల దినుసును తినడం మర్చిపోవద్దు.. 6 అద్భుత ప్రయోజనాలు!!

వాతావరణంలో వచ్చే ఈ మార్పు కారణంగా చాలామంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చలికాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. దీనిని ఎలా వాడాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Cinnamon

Cinnamon

శీతాకాలం ప్రారంభం కానుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి కొద్దిగా పెరుగుతోంది. వాతావరణంలో వచ్చే ఈ మార్పు కారణంగా చాలామంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చాలామంది వీటి కోసం మందులు వాడటం మొదలుపెడతారు. అయితే వంటగదిలో ఉండే కొన్ని సహజ పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. భారతీయ వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క (Cinnamon) ఒకటి. ఇది చలికాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో దాల్చిన చెక్కను వాడటం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

చలికాలంలో వ్యాధుల నుంచి రక్షణ కోసం..

బరువు-కొవ్వుకు చెక్: దాల్చిన చెక్క మెటబాలిజాన్ని (Metabolism) వేగవంతం చేస్తుంది, ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి.. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, దాల్చిన చెక్క పొడిని కలిపి తాగాలి. ఇది కొవ్వును కరిగించే (Fat-burning) ప్రక్రియను వేగవంతం చేస్తుంది, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును క్రమంగా తగ్గిస్తుంది.

శరీరాన్ని వెచ్చగా- రోగనిరోధక శక్తి అధికం: దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తులసి, అల్లంతో కలిపి దాల్చిన చెక్క కషాయాన్ని (Concoction) తయారు చేసుకుని తాగడం వలన గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం వెచ్చగా ఉంటుంది.

జీర్ణవ్యవస్థ మెరుగు: దాల్చిన చెక్కను తీసుకోవడం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా మంచిది. ఇది శరీరంలో ఉండే వాపును (Inflammation), అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇది రోజంతా చురుకుగా ఉంచుతుంది.

 ఇది కూడా చదవండి: కనురెప్పల అందం కోసం ఐదు అద్భుతమైన ఇంటి చిట్కాలు మీకోసం..!!

రక్తంలో చక్కెరకు నివారణ: దాల్చిన చెక్కలో ఉండే పాలిఫెనాల్స్ (Polyphenols) ఇన్సులిన్ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

చర్మ కాంతి- మొటిమలు తగ్గుతాయి: దాల్చిన చెక్క చర్మానికి కూడా చాలా ఆరోగ్యకరం. దీనిని తేనెతో కలిపి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి అప్లై చేయడం వలన మొటిమలు (Acne), నల్లటి మచ్చలు (Blackheads) తగ్గుతాయి.

గుండె ఆరోగ్యం మెరుగు: దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే దాల్చిన చెక్కను ఎప్పుడూ పరిమిత పరిమాణంలోనే వాడాలి. ఎందుకంటే అధికంగా తీసుకుంటే శరీరానికి హాని కలగవచ్చు. ఈ చలికాలంలో ఆహారంలో దాల్చిన చెక్కను చేర్చుకుని.. ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. మరికొద్ది సేపట్లో గుండెపోటు రావడం పక్కా..!

Advertisment
తాజా కథనాలు