/rtv/media/media_files/2025/10/09/cigarettes-2025-10-09-13-27-56.jpg)
Cigarette
సిగరెట్ తాగడం కంటే పొగాకు నమలడం (chewing tobacco) మరింత వేగంగా, తీవ్రంగా క్యాన్సర్‌కు దారితీస్తుంది. గుట్కా, పాన్ మసాలా, జర్దా వంటి పొగలేని పొగాకు ఉత్పత్తులు సిగరెట్ల కంటే ప్రమాదకరమని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పొగతాగడం మాత్రమే ప్రమాదకరం.. పొగాకు నమలడం అంత హానికరం కాదని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. పొగాకులో ఉండే రసాయనాలు నేరుగా నోరు, గొంతు కణాలను దెబ్బతీసి, క్యాన్సర్ వేగంగా, మరింత తీవ్రంగా అభివృద్ధి చెందేలా చేస్తాయని ఓ అధ్యయనం వెల్లడించింది. సిగరెట్లు కాల్చడం కంటే పొగాకు నమలడం ఎందుకు ప్రమాదకరమో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పొగాకు నమలడమే ప్రమాదకరం:
ఓ నివేదిక ప్రకారం.. పొగాకు నమలడం వల్ల నోరు, గొంతు క్యాన్సర్‌లు వేగంగా వస్తాయని ప్రపంచవ్యాప్త అధ్యయనం ద్వారా తెలిసింది. పొగాకులో ఉండే నైట్రోసమైన్స్ (TSNAs), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) వంటి ప్రమాదకరమైన పదార్థాలు DNAను నేరుగా దెబ్బతీస్తాయి. సిగరెట్ పొగ కొంతవరకు వాతావరణంలో చెదిరిపోతుంది. కానీ నమిలే పొగాకు నేరుగా నోటి కణాలతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రత్యక్ష సంబంధం లోపలి కణజాలంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది.
ఇది కూడా చదవండి: చిన్నారుల్లో జలుబు, దగ్గుకు చెక్ పెట్టే అద్భుతమైన ఇంటి చిట్కాలు !!
పొగాకు నమలడం అలవాటు యువతలో ఫ్యాషన్‌గా లేదా ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా మారిందని.. కానీ ఇది క్యాన్సర్‌తోపాటు పంటి క్షయం, చిగుళ్ల వ్యాధులు, జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు, పొగాకు సంబంధిత క్యాన్సర్‌లు చాలా వరకు ముదిరిన దశలో (Advanced Stages) గుర్తించడం వలన చికిత్స చేయడం కష్టంగా మారుతుంది. నోరు, నాలుక, గొంతు మరియు అన్నవాహిక క్యాన్సర్‌లకు సాధారణంగా శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ వంటి సంక్లిష్ట, ఖరీదైన చికిత్సలు అవసరమవుతాయి. పొగాకును పీల్చినా లేదా నమిలినా అది ప్రాణాంతకమేనని.. ఈ అలవాటును త్వరగా మానుకుంటే ప్రాణాపాయకరమైన వ్యాధులను నివారించవచ్చని పరిశోధకులు ప్రజలకు గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఇలా చేస్తే 15 రోజుల్లో షుగర్ కంట్రోల్‌లోకి రావడం ఖాయం.. తప్పక తెలుసుకోండి!