/rtv/media/media_files/2025/07/25/children-baldness-2025-07-25-20-35-59.jpg)
children baldness
Children Baldness: బిడ్డ పుట్టినప్పుడు దృష్టి అతను ఎవరిని పోలి ఉన్నాడనే విషయంపైనే కేంద్రీకృతమవుతుంది. అతని కళ్లు తండ్రిని పోలివున్నాయా? చిరునవ్వు తల్లిని పోలివుందా? లుక్స్ మాత్రమే కాకుండా అనేక ఆరోగ్యపరమైన లక్షణాలు కూడా వారసత్వంగా బిడ్డకు బదలవుతాయి. అందులో ముఖ్యమైన అంశం బట్ట తల సమస్యలు. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. పురుషుల్లో కనిపించే బట్టతల సమస్యకు తల్లి వారసత్వమే ప్రధాన కారణం కావచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
వారసత్వంగా వచ్చే జెనెటికల్ పరిస్థితి..
జుట్టు మార్పిడి, చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బట్టతల అనేది తండ్రి ద్వారా మాత్రమే వస్తుందన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది పూర్తిగా తప్పు. శాస్త్రీయంగా చూస్తే.. జుట్టు రాలడం లేదా బట్టతలకి సంబంధించిన ముఖ్యమైన జన్యువులు తల్లి నుంచి వచ్చే X క్రోమోజోమ్‌లో ఉంటాయని తాజా జన్యు పరిశోధనలు వెల్లడించాయి. తల్లి కుటుంబంలోని పురుషుల్లో బట్టతల తరచూ ఉంటే.. ఆ లక్షణం కొడుకులోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ పరిస్థితిని ఆండ్రోజెనిక్ అలోపేసియా అని పిలుస్తారు. ఇది వారసత్వంగా వచ్చే జెనెటికల్ పరిస్థితి. తల్లి నుంచి వచ్చే X క్రోమోజోమ్‌లోని బలహీన జన్యువులు, జుట్టు పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది ఆరంభ దశలో గుర్తించబడితే.. కొంతవరకు నియంత్రించవచ్చు. అయితే ఈ జన్యుపరమైన కారణాలను మనం మార్చలేము. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఆలయాల్లో మొబైల్ ఫోన్ వినియోగం ఎందుకు నిషేధమో తెలుసా..?
దానికి కోసం కొన్ని సూచనలు పాటించడం అవసరం. మొదటిగా సరైన జుట్టు సంరక్షణ దినచర్యను పాటించాలి. సూటిగా చెప్పాలంటే.. తలకు అవసరమైన శుభ్రత, తేమ, పోషణ కలిగించే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉపయోగించాలి. అంతేకాకుండా ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాల కొరత వల్ల కూడా జుట్టు త్వరగా పడిపోవచ్చు. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ప్రాణాయామం వంటి మనశ్శాంతి పద్ధతులను పాటించాలి. ఒత్తిడి కూడా జుట్టు రాలడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చివరిగా మీ జుట్టు ఆరోగ్యాన్ని తరచూ తనిఖీ చేస్తూ.. ప్రారంభ లక్షణాల్ని గుర్తించి వెంటనే నిపుణులను సంప్రదించడం ఉత్తమ మార్గం. వారసత్వంగా వచ్చిన జెన్స్‌ను మార్చలేకపోయినా, ఆరోగ్యపరమైన చర్యల ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ సమాచారం బట్టతలపై ఉన్న అపోహలను తొలగించి.. జుట్టును కాపాడుకునే దిశగా మనల్ని నడిపించగలదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: గుండెల్లో మంటకు ఇంటి పద్ధతులతో తక్షణ ఉపశమనం
( children | Health Tips | latest health tips | best-health-tips | Latest News )