/rtv/media/media_files/2025/11/10/wife-nicknames-2025-11-10-12-12-11.jpg)
Wife Nicknames
భార్యాభర్తల బంధం ఎంతో విలువైనది, పవిత్రమైనది. ఈ బంధానికి ప్రేమ, నమ్మకం, పరస్పర అవగాహన పునాదులు. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా, అండగా ఉంటూ, సంతోషంలో, కష్టంలో భాగమవుతూ ఉండటం వలన ఈ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేయడానికి భార్యాభర్తలు చాలా ముద్దు పేర్లతో ఒకరినొకరు పిలుచుకుంటారు. ఇలాంటి పిలుపులు వారి బంధాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. అయితే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, లేదా భార్య ఏదైనా విషయంలో కోపగించుకోవడం సర్వసాధారణం. అల్లరి కోపాలు, చిన్న చిన్న అలిగింపులు ప్రేమను పెంచుతాయంటారు. కానీ కొన్నిసార్లు కోపం కొంచెం ఎక్కువ అయినప్పుడు.. ఆ కోపాన్ని క్షణంలో మాయం చేసి ఆమె ముఖంలో చిరునవ్వును తీసుకురావడానికి ఆప్యాయమైన పేర్లను ఉపయోగించవచ్చు. భార్యను ఆప్యాయంగా పిలవడానికి కొత్తగా, ముద్దుగా ఉండే ఈ పేర్లను ప్రయత్నించండి. మీరు మీ మొబైల్‌లో కూడా ఆమె పేరును ఈ నిక్‌నేమ్‌లతో సేవ్ చేసుకోవచ్చు.
భార్య కోసం ప్రేమతో కూడిన ముద్దు పేర్లు:
మై ఏంజెల్ (My Angel): ఈ పేరు మీ భార్య దేవతలాంటిదని.. మీకు అత్యంత ప్రియమైనదని ఆమెకు తెలియజేస్తుంది.
మై స్వీటీ (My Sweetie): మీరు మీ భార్యను ఎంతో ప్రేమగా మై స్వీటీ అని పిలవవచ్చు. ఈ పేరు ఎంతో మధురంగా ఉంటుంది. ఇది మీ భార్యకు చాలా నచ్చుతుంది.
మై లండన్ (My London): ఈ పేరు కొంచెం సరదాగా ఉన్నప్పటికీ.. మీ ప్రేమను తెలియజేస్తుంది. ఇది మీ భార్యకు చాలా నచ్చుతుంది.
బేబీ (Baby): ఈ పేరు చాలా ముద్దుగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంతో ఆప్యాయంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: అక్కడ నొక్కితే పొట్టలోని గ్యాస్ బస్సుమంటూ బయటకొచ్చేసింది తెలుసా!!
మై లవ్ (My Love): ఇది చాలా మధురమైన పేరు. ఈ పేరు మీ భార్య పట్ల మీకున్న ప్రేమను, అనురాగాన్ని ప్రతిబింబిస్తుంది.
మై లైఫ్ (My Life): ఈ పేరు మీ భార్య మీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది. మీ భార్య ఈ పేరును బాగా ఇష్టపడుతుంది.
స్వీటీ (Sweetie): మీ భార్య తీయగా ఉంటే.. ఆమెను స్వీటీ అని పిలవండి. ఆమె ఖచ్చితంగా ఆనందపడుతుంది.
కార్టూన్ (Cartoon): మీ భార్య సరదాగా, చురుకుగా ఉంటే.. మీరు ఆమెను నవ్వుతూ కార్టూన్ అని పిలవవచ్చు. ఈ ముద్దు పేర్లు మీ భాగస్వామితో మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. వారి ముఖంలో సంతోషాన్ని నింపుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కఫం ఇబ్బంది పెడుతుందా.. దగ్గుతో పరేషాన్ అవుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందండి!!
Follow Us