/rtv/media/media_files/2025/10/07/cancer-2025-10-07-10-08-47.jpg)
Cancer Health Tips
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నిరోధించగలిగే ఔషధ గుణాలున్న ఆహారం మన చుట్టూనే ఉందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి అద్భుతమైన గుణాలున్న ఒక ఆహారం బాదం గింజలు. బాదం గింజలలో క్యాన్సర్‌ను నిరోధించగలిగే శక్తివంతమైన పోషక పదార్థం B17 పుష్కలంగా ఉందని నిపుణులు అంటున్నారు. రోజువారీ ఆహారంలో ఈ బాదం గింజలను భాగం చేసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చు, ఒకవేళ క్యాన్సర్ ఉన్నా దాని తీవ్రతను తగ్గించుకోవచ్చు. అలాంటి దేశ దేశవాళీ బాదం గింజల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఎలాంటి బాదం గింజలు తీసుకోవాలి?
అయితే మార్కెట్లో లభించే ఏ బాదం గింజలు పడితే అవి తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుకాణాలలో దొరికేవి క్లీన్ మాడిఫైడ్ ఆర్గానిజం (Clean Modified Organism - CMO) రకానికి చెందినవై ఉండవచ్చు. మనకు కావలసింది, పూర్వకాలం నుంచి మన దేశంలో సహజంగా పెరిగే దేశవాళీ బాదం గింజలు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. ఈ దేశవాళీ బాదం గింజలు బారుగా, సన్నగా ఉంటాయి. ఇవి సాధారణంగా ఊళ్లలో చెట్లకు కాసి, పగలగొట్టిన తర్వాత మొదట్లో కొంచెం లావుగా ఉండి.. చివర సన్నగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: చిన్న పిల్లల దగ్గుకు సిరప్ అవసరమే లేదు.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
ఈ దేశవాళీ బాదం గింజలను రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఉదయం ఐదు (5), సాయంత్రం నాలుగు (4) బాదం గింజలను నానబెట్టి తింటే.. శరీరానికి B17 పుష్కలంగా అందుతుంది. ఈ B17 పోషకానికి క్యాన్సర్‌ను అదుపు చేసే ఔషధ లక్షణం ఉందని.. అలాగే వ్యాధి రాకుండా నిరోధించగలిగే గుణం కూడా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి క్యాన్సర్‌ను నివారించడంలో ఈ దేశవాళీ బాదం గింజలు అద్భుతమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఖరీదైన ఫేషియల్స్‌తో పనిలేదు..ఇంట్లోనే ముఖం మెరిపించే సులభ చిట్కాలు