Health Tips: సిగరెట్ తాగడం, వ్యాయామంతోపాటు.. తిన్న వెంటనే చేయకూడని 5 ముఖ్యమైన పనులు ఇవే!

సిగరెట్ తాగడం, వ్యాయామంతోపాటు భోజనం చేసిన వెంటనే చేయకూడని 5 ముఖ్యమైన పనులు ఉన్నాయి. నిద్రపోవడం, భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగడం, ధూమపానం, టీ-కాఫీ తాగడం, వ్యాయామం వంటి చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాక, గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

New Update
exercise and food eating

exercise and food eating

ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో.. దాన్ని తీసుకున్న తర్వాత మనం పాటించే అలవాట్లు కూడా అంతే ముఖ్యం. చాలామంది తెలియక సిగరెట్ తాగడం, వ్యాయామంతోపాటు భోజనం చేసిన వెంటనే కొన్ని తప్పులు చేస్తుంటారు. అవి క్రమంగా జీర్ణక్రియను బలహీన పరిచి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి సిగరెట్ తాగడం, వ్యాయామంతోపాటు భోజనం చేసిన వెంటనే చేయకూడని 5 ముఖ్యమైన పనులు ఉన్నాయి. వాటి  గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌ తెలుసుకుందాం.

భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగడం:

చాలామందికి సిగరెట్ తాగడం, వ్యాయామంతోపాటు భోజనం పూర్తయిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు, ఎంజైమ్‌ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కాక, గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల వరకు నీళ్లు తాగకూడదు.

నిద్రపోవడం:

వ్యాయామం చేసి భోజనం చేసిన వెంటనే పడుకోవడం, నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాక, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా.. ఊబకాయం పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి భోజనం తర్వాత కాసేపు నడవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ధూమపానం:

చాలామందికి భోజనం తర్వాత సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. భోజనం తర్వాత సిగరెట్ తాగడం సాధారణ సమయాల్లో కంటే చాలా రెట్లు ఎక్కువ హానికరం అని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, జీర్ణ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అరటిపండుతో జుట్టు మెరిసేలా అవుతుందని తెలుసా!! అదెలానో ఇప్పుడే చదవండి


టీ-కాఫీ తాగడం:

భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరంలో ఐరన్, ఇతర పోషకాల శోషణ ప్రభావితమవుతుంది. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్యను ఇది పెంచుతుంది. టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే.. భోజనం చేసిన కనీసం గంట తర్వాత మాత్రమే వాటిని తీసుకోవాలని చెబుతున్నారు.

వ్యాయామం:

భోజనం తర్వాత వెంటనే కఠినమైన వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యానికి హానికరం. ఇలా చేయడం వల్ల రక్తం కండరాల వైపు ఎక్కువగా ప్రవహించి, జీర్ణ వ్యవస్థకు తగినంత రక్తం అందదు. దీనివల్ల కడుపు నొప్పి, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తవచ్చు. వ్యాయామం చేయాలనుకుంటే.. భోజనం చేసిన కనీసం ఒకటిన్నర నుంచి రెండు గంటల తర్వాత చేయాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఆ లక్షణాలు కనిపిస్తే మీకు మూడినట్లే.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ఏం జరుగుతుందో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు