/rtv/media/media_files/2025/10/25/wheatgrass-juice-2025-10-25-14-25-19.jpg)
Low BP
నేటి కాలంలో ఆరోగ్య సమస్యల్లో లోబీపీ (Low BP) అనేది చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దీని కారణంగా కళ్ళు తిరగడం, పడిపోవడం, తీవ్రమైన నీరసం, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారు సొంత పనులు కూడా చేసుకోలేనంతగా నిస్సత్తువకు లోనవుతుంటారు. సాధారణంగా లోబీపీ తగ్గడానికి నీటిలో ఉప్పు కలుపుకుని తాగమని సలహా ఇస్తుంటారు. కానీ తరచుగా ఇలా చేయడం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లోబీపీ అనేది హైబీపీ అంత తీవ్రమైన జబ్బు కాదు. నిజానికి దీన్ని ఒక జబ్బుగా కూడా పరిగణించలేం. ఇది శరీరంలో ఉండే మానసిక బలహీనత (Mental Weakness), శక్తి స్థాయిలు (Energy Levels) తగ్గడం వలన వస్తున్న సమస్య. ముఖ్యంగా హిమోగ్లోబిన్ లోపం, బీ-కాంప్లెక్స్ లోపం కారణంగానే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
లోబీపీకి ప్రధాన కారణాలు:
శరీరానికి అవసరమైన విటమిన్లు, ఎంజైములు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వలన.. అవి సరిగ్గా గ్రహించబడక ఐరన్ లోపంతో ఉండటం లోబీపీకి దారితీస్తుంది.
సోడియం-పొటాషియం అసమతుల్యత:పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం వలన సోడియం మరియు పొటాషియంల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది.
కృత్రిమ సోడియం వినియోగం: సహజమైన సోడియం ఉండే ఆహారాలకు బదులు కృత్రిమమైన సోడియంను తరచుగా తీసుకోవడం వలన సోడియం వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు కూడా లోబీపీ వస్తుంది.
ఉడికించిన ఆహార అలవాటు:ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కేవలం ఉడికించిన ఆహారం తినే అలవాటు ఉన్నవారికి కూడా ఈ సమస్య ఎక్కువ. తిన్నది త్వరగా జీర్ణం కాక, బలహీనంగా మారి, రక్తహీనతకు గురై లోబీపీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: పొట్ట కొవ్వు తగ్గాలంటే..30 రోజుల్లో ఈ నూనె ఓ చెంచా తీసుకోండి!!
లోబీపీ తగ్గడానికి సహజ నివారణ మార్గాలు:
క్యారెట్-బీట్‌రూట్ జ్యూస్: లోబీపీ సమస్య తగ్గాలంటే ఉదయం, సాయంత్రం క్యారెట్-బీట్‌రూట్ జ్యూస్ తాగాలి. కావాలనుకుంటే ఇందులో తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు.
దానిమ్మ జ్యూస్:లోబీపీ ఉన్నవారు దానిమ్మ గింజల జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది.
ఫైబర్ అధికంగా ఉండే పండ్లు:గ్యాస్ ట్రబుల్ లేకుండా, మోషన్ ఫ్రీగా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. రోజులో 25-30% ఆహారం పండ్లు ఉండేలా చూసుకోవాలి. వాటిల్లో బొప్పాయి, దానిమ్మ, కర్బూజా, పుచ్చకాయ, జమకాయ పండ్లు ఇంకా ఎక్కువ మేలు చేస్తాయి.
గోధుమ గడ్డి రసం (Wheatgrass Juice):ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం. ఎనిమిది రోజుల్లో పెంచుకున్న గోధుమ గడ్డి రసాన్ని ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు తేనె, నిమ్మరసం కలిపి తాగితే లోబీపీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ 15 రోజుల పాటు ఈ డైట్‌ను అనుసరించడం ద్వారా లోబీపీ, నీరసం, ఐరన్ లోపం, బీ-కాంప్లెక్స్ లోపాల నుంచి బయటపడి చురుకుగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: దోమను చంపిన తర్వాత చేతులు కడగకపోతే డేంజర్.. ఏమవుతుందో తెలుసా?
Follow Us