Men Health: పురుషులు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు

50 ఏళ్లు దాటిన పురుషుడు సంవత్సరానికి ఒకసారి ప్రోస్టేట్ పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఊబకాయం, శారీరక శ్రమ లేని జీవనశైలి, ధూమపానం, మద్యం వంటివి సమస్యలు ఎక్కువగా పెంచుతాయి.

New Update
Men Health

Men Health

Men Health: పురుషులు వయసు పెరిగే కొద్దీ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు ముఖ్యమైనవి. 50 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత తరచూ మూత్ర విసర్జనకు వెళ్లే అవసరం, మూత్రంలో మంట లేదా నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ఎందుకంటే ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంకేతాలుగా ఉండే అవకాశం ఉంది. ప్రోస్టేట్ గ్రంథి మూత్రాశయం కింద ఉండి మూత్రం, వీర్యం ప్రవాహానికి సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ ఈ గ్రంథి క్రమంగా విస్తరించి మూత్ర పూరక వ్యవస్థపై ఒత్తిడి కలిగిస్తుంది. దీని వల్ల మూత్రం పూర్తి స్థాయిలో రావడం లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది.

50 ఏళ్లు దాటితే అప్రమత్తంగా ఉండాలి:

దీన్ని తేలికగా తీసుకోవడం వల్ల వ్యాధి మూడవ దశ లేదా నాలుగవ దశలోనే గుర్తింపు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూత్రంలో లేదా వీర్యంలో రక్తం, నడుము దిగువన నిరంతర నొప్పి వంటి లక్షణాలు ఉన్నా కూడా అప్రమత్తంగా ఉండాలి. 50 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడు సంవత్సరానికి ఒకసారి ప్రోస్టేట్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఊబకాయం, ఆరోగ్య రహిత ఆహారం, శారీరక శ్రమ లేని జీవనశైలి, ధూమపానం, మద్యం వంటి కారణాలు కారణమవుతాయి. అలాగే కుటుంబంలో ఈ వ్యాధికి చరిత్ర ఉన్నవారికి కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఈ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ కంటే ప్రమాదకరం

ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతో అవసరం. రోజూ సరైన ఆహారం తీసుకోవడం, ఆకుకూరలు, కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం మానడం, మద్యం విడిచిపెట్టడం వంటి చర్యలు సహాయపడతాయి. ఎలాంటి లక్షణాలు గమనించినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ వ్యాధిని అదుపులో పెట్టే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నడిచినప్పుడు అలా అనిపిస్తే.. మీకు హార్ట్ ఎటాక్ రిస్క్ ఉన్నట్లే.. తప్పక తెలుసుకోండి!

( men-health | men-health-tips | men-health-special | helth-tips | best-helth-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు