/rtv/media/media_files/2025/04/11/jeFu8wnA1oyjh4OxGBJN.jpg)
Beer
Beer: సాధారణంగా ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమని చెబుతారు. అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయం, గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే బీర్ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అతిగా కాకుండా మోతాదులో తాగితే మాత్రమే ప్రయోజనాలు ఉంటాయి. లేదంటే ఆరోగ్యానికి ప్రమాదం. ప్రపంచ ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం.. మహిళలు రోజుకు 330 మిల్లీలీటర్ల బీరు తాగవచ్చు. అదేవిధంగా పురుషులు 660 మిల్లీలీటర్ల వరకు తాగవచ్చు. బీర్ లోని పాలీఫెనాల్స్, విటమిన్లు, అమైనో ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణుల అభిప్రాయం.
ఇది కూడా చదవండి: అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' HD ప్రింట్ లీక్!
గుండె సమస్యల ప్రమాదాన్ని..
అయితే అధిక వినియోగం ప్రయోజనాలకు బదులుగా చెడు ప్రభావాలను కలిగిస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం.. బీరును మితంగా తీసుకోవడం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుందని తేలింది. ఎముకల్లో ఆరోగ్యాన్ని పెంచే సిలికాన్‌లో అధికంగా ఉంటుందని కనుగొన్నారు. అలాగే బీర్ లో నీరు ఎక్కువగా ఉండటం వల్ల మూత్ర విసర్జన సులభతరం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. బీరులో శరీరానికి అవసరమైన ఖనిజాలు, బి విటమిన్లు సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును, ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు బీర్ లో ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఇది మామూలు ప్లానింగ్ కాదు భయ్యా.. అమెజాన్ ఆర్దర్లతో పగ మాజీ గర్ల్ ఫ్రెండ్ పై ప్రతీకారం!
(beer-benefits | beer bottle | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)