/rtv/media/media_files/2025/04/11/i6NrXfTWToAZlkhIhNWq.jpg)
boyfriend took revenge with amazon oders
Viral News: అమెజాన్ లో ఆర్దర్లు పెట్టి మాజీ ప్రేయసి పై పగ తీర్చుకున్నాడు ఓ బాయ్ ఫ్రెండ్. పగ తీర్చుకోవడానికి ఆర్దర్లు పెట్టడమేంట్రా బాబు! అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది! అదేంటో కింద ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి.
అమెజాన్ ఆర్దర్లతో పగ
అయితే ఓ యువకుడు మాజీ ప్రేయసిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ సైట్స్ నుంచి తరచూ ఆమె ఇంటికి కాష్-ఆన్-డెలివరీ (COD) ఆర్డర్స్ పంపడం మొదలు పెట్టాడు. ఇలా సుమారు 300 కాష్-ఆన్-డెలివరీ (COD) పార్సెల్స్‌ను ఆమె ఇంటికి పంపించాడు. ప్రతీ సారి ఆర్డర్స్ ఆమె ఇంటి వరకూ వెళ్లడం, ఆ తర్వాత ఆమె వాటిని ఆర్డర్ చేయలేదని చెప్పడంతో డెలివరీ బాయ్ వెనక్కి తీసుకెళ్లడం జరిగేది. ఆమెకు వచ్చే పార్శిల్‌లు ఎక్కువగా ఖరీదైన గాడ్జెట్లు, దుస్తులు వంటి వస్తువులతో వస్తూ ఉండేవి. దీంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ల ఆమె ఖాతాలను కూడా బ్లాక్ చేశారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తనకు కూడా అర్థం కాలేదు.
Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో
నాలుగు నెలల పాటు ఇదే కొనసాగడంతో విసిగిపోయిన ఆమె మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఆ ఆ ఆర్డర్లు నాడియా జిల్లాకు చెందిన సుమన్ సిక్దార్ నుంచే వస్తున్నట్లు తెలిసింది. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో.. సుమన్ తప్పు ఒప్పుకున్నాడు. తన మాజీ ప్రేయసికి ఆన్‌లైన్ షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉండేదని, ఆమె కోరికలన్నీ తీర్చలేకపోయినందునే వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని చెప్పాడు. అందుకే ఆమెను ఇబ్బంది పెట్టేందుకు ఇలా చేసినట్లు ఒప్పుకున్నాడు.
latest-news | viral-news
Also Read: Shanmukha OTT: ఓటీటీలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ 'షణ్ముఖ'.. ఎక్కడ చూడొచ్చంటే..?