/rtv/media/media_files/2025/08/29/fried-fast-foods-2025-08-29-19-53-22.jpg)
Fried fast foods
పలు రకాల ఆహారాలు రుచికరంగా ఉన్నప్పటికీ.. కొన్ని మన ఆరోగ్యానికి హానికరం. వాటిలో కొన్ని బరువు పెరగడానికి, మరికొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తాయి. ఈ ఆహారాలు వాటి తయారీ విధానం, అధికంగా వాడే నూనెలు, ఉప్పు, చక్కెర వల్ల ప్రమాదకరంగా మారతాయి. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. నేటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంతో కష్టంగా మారింది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలు నిశ్శబ్దంగా మీ శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా గుండె, మెదడు, రక్తనాళాలపై ప్రభావం చూపుతాయి. అవి ఏమిటో వాటిని ఎలా నివారించాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రమాదకరమైన ఆహారాలు..
మనం రోజువారీ వంటల్లో ఉపయోగించే కొన్ని నూనెలు, మార్జరిన్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తం ప్రసరణకు అడ్డుపడతాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కొనేటప్పుడు వాటిపై పాక్షికంగా హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ అని ఉంటే వాటికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ అయిన బ్రెడ్, డబ్బా సూప్స్, సాస్‌లు, ఇతర స్నాక్స్‌లో కనిపించే సోడియం సాధారణ స్థాయి కంటే 3-4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక సోడియం తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోయి, రక్త పరిమాణం పెరిగి రక్తపోటు అధికమవుతుంది. రోజుకు 2,300 mg కంటే తక్కువ సోడియం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక చక్కెర ఉన్న పానీయాలు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని 38% పెంచుతాయట. రోజుకు ఒక సోడా డ్రింక్ తాగడం వల్ల హృదయనాళ సంబంధిత వ్యాధులు 8శాతం, గుండె జబ్బులు 15శాతం పెరిగే ప్రమాదం ఉంది. ఈ చక్కెర పానీయాలు ఇన్సులిన్ నిరోధకత, రక్తనాళాల వాపు, గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. వాటికి బదులుగా సాదా నీరు లేదా టీ తాగడం మంచిది.
ఇది కూడా చదవండి: బ్రేక్ ఫాస్ట్‌లో అన్నం తింటారా..? అయితే ఈ విషయం మీ కోసమే..!
బేకన్, హాట్ డాగ్స్, డెలి మీట్స్ వంటి ప్రాసెస్డ్ మాంసాల్లో అధిక సోడియం, నైట్రేట్స్ అండ్ ఏజీఈస్ ఉంటాయి. కేవలం 50 గ్రాముల ప్రాసెస్డ్ మాంసం రోజుకు తినడం వల్ల గుండెపోటు ప్రమాదం 15శాతం పెరుగుతుంది. అలాగే ఇవి డయాబెటిస్, గుండె సంబంధిత మరణాలకు కూడా కారణం కావచ్చు. శుద్ధి చేసిన పిండిపదార్థాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని 15శాతం వరకు పెంచుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, వాపును ప్రేరేపిస్తాయి. అలాగే శరీరంలో అనవసరమైన కొవ్వును పెంచుతాయి. వీటి బదులు తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రతి అదనపు రోజువారీ సర్వింగ్, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని 7% పెంచుతుంది. ఈ ఆహారాలు వాపును పెంచి, రక్తనాళాలను దెబ్బతీసి, ప్లేక్ పేరుకుపోవడానికి కారణమవుతాయి. ఎప్పుడూ తాజా, తక్కువ ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఆహారాలను నివారించడం ద్వారా హృదయాన్ని, మెదడును, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నకిలీ తేనెతో మీ కిడ్నీలు ఫసక్.. ఇలా పసిగట్టండి!