Gut health
Gut Health: వేసవి కాలంలో పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి తేమ తగ్గడం, జీర్ణక్రియ మందగించడం, ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశాలు పెరుగుతాయి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడం అవసరం. ఉదయం వేళ గోరు వెచ్చని నీటిని తాగడం మంచిది. ఇది పేగులను శుభ్రం చేసి టాక్సిన్లను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండేందుకు లేత కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ జ్యూస్, పుదీనా పానీయాల, సోంపు టీలు ఉపయోగపడతాయి. ఇవి తేమను అందించడంతో పాటు, జీర్ణ సమస్యలను నివారిస్తాయి.
మలబద్ధకాన్ని నివారించడంలో..
పండ్లు, కూరగాయలు వేసవిలో తప్పనిసరిగా ఉండే భాగం కావాలి. పుచ్చకాయ, బొప్పాయి, దోసకాయ వంటి వాటిలో ఎక్కువ నీరు ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. ప్రీబయోటిక్స్ అధికంగా ఉండే అరటిపండు, వెల్లుల్లి, ఉల్లిపాయలు పేగులోని మంచి బాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి. అదే విధంగా పెరుగు, మజ్జిగ, లస్సీ లాంటి ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారం, పేగు ఫ్లోరాను సమతుల్యం చేస్తాయి. వేయించిన, కారంగా ఉండే, అధికంగా చక్కెర కలిగిన ఆహారాలు వేసవిలో పేగులకు మోతాదు తప్పిన భారం కలిగిస్తాయి. ఇవి జీర్ణమవడానికి సమయం తీసుకుంటాయి. శరీరాన్ని వేడిచేస్తాయి.
ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి
పేగు సంకోచానికి కారణమవుతాయి. బదులుగా తేలికపాటి ఆహారం, సలాడ్లు, పీచుపదార్థాలు, ఉడికించిన దినుసులు తీసుకోవాలి. వీటి ద్వారా శరీరానికి తేమను అందించడంతో పాటు అవసరమైన పోషకాలూ అందుతాయి. ఇంకా ముఖ్యంగా నిద్రపోయే ముందు తక్కువగా తినడం, వేళకు ఆహారం తీసుకోవడం, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం వల్ల వేసవిలో గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత సమస్యలు తక్కువ అవుతాయి. రోజూ చిన్నచిన్న వ్యాయామాలు లేదా యోగా ద్వారా కూడా జీర్ణవ్యవస్థను యాక్టివ్‌గా ఉంచవచ్చు. వేసవి కాలాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచాలంటే తీసుకునే ఆహారంలో తేమ, ఫైబర్, ప్రోబయోటిక్స్‌ను చేర్చడం మర్చిపోవద్దు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: థైరాయిడ్ రోగులు తినాల్సిన, తినకూడని ఆహార పదార్థాలు
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )