/rtv/media/media_files/2025/08/31/hungry-2025-08-31-10-09-07.jpg)
Hungry
నేటి కాలంలో బిజీ లైఫ్‌లో ఉండి భోజనానికి చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. అందులోనూ కూడా ప్రశాంతంగా భోజనం చేయకుండా మొబైల్ లేదా టీవీ వంటివి చూస్తుంటారు. అదే ఏదైనా పని ఉన్నవారు అయితే హడావుడిగా తింటుంటారు. ఇలా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగం చేసే వారు పని ఒత్తిడి వల్ల సరైన సమయానికి తినరు. అలాగే సమయం లేదని ఒక ఐదు నిమిషాల్లో తొందరగా భోజనం చేస్తుంటారు. అదే గృహిణులు అయితే కుటుంబ పనుల్లో బిజీగా మారి తొందరగా తినేస్తారు. ఇప్పుడున్న రోజుల్లో అయితే మొబైల్‌లో రీల్స్ చూస్తూ కొందరు తింటుంటారు. అసలు ఫుడ్ మీద ధ్యాస పెట్టకుండా తింటారు. ఇలా తినడం వల్ల వారికి భోజనం చేసిన వెంటనే ఆకలి వేస్తుంది. దీంతో దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Raw Onion: పొరపాటున పచ్చి ఉల్లిపాయ తింటే ఎంత డేంజరో తెలుసా?
హడావిడిగా తింటున్నారా..
బిజీ వల్ల కొందరు వేగంగా తింటారు. దీనివల్ల ఆ నిమిషానికి కడుపు అయితే నిండుతుంది. కానీ ఆ సంకేతాలు మెదడుకు చేరడానికి కనీసం 8 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. ఈలోపు మనం ఇంకా ఎక్కువ ఆహారం తీసుకుంటాం. దీనివల్ల ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరి బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు రెండు నిమిషాల్లోనే తినేస్తారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, అజీర్ణం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తొందరగా కాకుండా నిదానంగా ఆహారాన్ని నమిలి తినడం వల్ల జీర్ణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు తినేటప్పుడు లెప్టిన్, గ్రెలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. అయితే వేగంగా తింటే ఈ హార్మోన్లు సరిగ్గా విడుదల కావు. అందుకే ఎంత తిన్నా ఏదో వెలితిగా అనిపిస్తుంది. దీంతో తిన్న వెంటనే కొన్ని క్షణాల్లోనే ఆకలి వేస్తుంది. అలాగే భోజనం మీద ధ్యాస పెట్టి తినాలి. లేకపోతే భోజనం చేసినట్లు మెదడు గ్రహించదు. దీనివల్ల మళ్లీ ఆకలి వేసినట్లు అనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇలా తింటేనే ఆరోగ్యం
భోజనం చేసేటప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా తినడమే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం ఎంత తిన్నామనే దాని కంటే ఎంత మైండ్‌ఫుల్‌గా తిన్నామనేదే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. తినేటప్పుడు దాని వాసన, రుచి వంటివి గమనిస్తూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల మీకు కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, తిన్న వెంటనే ఆకలి వేయడం వంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Diet Tips: వర్షాకాలంలో మంచి ఆరోగ్యం కావలా..? ఈ ఆహార చిట్కాలు మీ కోసమే!!