/rtv/media/media_files/2024/12/12/Oi0MP4hlfwZ9uwhSHEYx.jpg)
Superstar Rajinikanth
Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. శివాజీ రావ్ గైక్వాడ్ నుంచి రజినీకాంత్‌గా మారాడు తలైవా. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన, ప్రజాదరణ పొందిన నటులలో ఒకడు. తన ప్రత్యేక శైలికి పేరుగాంచిన రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో అభిమానులు ఎక్కువగా ఉన్నారు. తలైవా అంటే కొన్నిచోట్ల దేవుడిలా కొలుస్తారు అభిమానులు. మదురైలో ఆయనకు ఆలయం కూడా కట్టించారు.
అభిమానులు క్యూ..
రజనీకాంత్ పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఆయన ఇంటి దగ్గర సందడి మామూలుగా ఉండదు. కేక్‌లు కట్ చేయడం మొదలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి చెన్నై నివాసం వెలుపల అభిమానుల సముద్రం కనిపిస్తుంది. పోస్టర్లు, ప్లకార్డులు తీసుకుని రజినీ ఇంటి ముందు అభిమానులు క్యూ కడతారు.
Also Read: పాలలో ఖర్జూరం కలిపి తాగితే ఇన్ని లాభాలా.. ఈ ఆరోగ్య రహస్యం ట్రై చేయండి
గత ఏడాది రజనీకాంత్ అభిమానులు ఆయన పుట్టినరోజును గ్రాండ్‌గా జరిపించారు. మదురైలోని అభిమానులు 15 అడుగుల పొడవు, 73 కిలోల కేక్‌ను కట్ చేశారు. #HBDSuperstarRajinikanth, #Thalaivar వంటి హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లలో విషెస్ చెబుతుంటారు. తమిళనాడుతో పాటు కర్నాటకలోని పలు థియేటర్లలో రజినీకాంత్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు.
Also Read: ఉదయాన్నే పసుపు నీరు తాగితే అనేక వ్యాధులు దూరం.. వారం చూడండి
రజినీకాంత్ డిసెంబర్ 12, 1950న బెంగళూరులోని మరాఠీ హిందూ కుటుంబంలో జన్మించారు. గవిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రాథమిక పాఠశాలతో పాటు ఆచార్య పాఠశాల పబ్లిక్ స్కూల్‌లో రజినీకాంత్ చదువుకున్నారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పూర్తి చేశారు. నిర్మాత కె బాలచందర్ రజినీకాంత్‌లోని టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించారు. అంతేకాకుండా రజినీకాంత్ అనేపేరు కూడా ఆయనే పెట్టారు.1975లో తమిళ సినిమాతో అరంగేట్రం చేశారు. రజనీకాంత్ 2000లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2016లో పద్మవిభూషణ్, 2019లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు.
Also Read: చలికాలంలో పుట్టగొడుగులను తింటే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు