Khammam Loan APP Harassment : లోన్ కట్టలేదని ఇంత దారుణమా..! | Kothagudem Santosh | RTV
లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్లో చోటుచేసుకుంది. లోన్యాప్లో తీసుకున్న రూ.3 లక్షలు కట్టలేకపోవడంతో ఏజెంట్లు వేధింపులు పెట్టారు. దీంతో మానసిక ఆవేదన చెంది ఆ యువకుడు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో విషయం చోటుచేసుకుంది. ఆన్లైన్మెట్టింగ్లో మోసం పోయ్యారని ఓ కుటుంబం గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
లోన్ యాప్స్ వేధింపులు భరించలేక గుంటూరుకు చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రీశైలం శిఖరేశ్వరం అడవుల్లో 10 అడుగుల లోతులో దూకింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా యువతి ఆచూకీ లభ్యమైంది.
నకిలీ.. మోసపూరిత లోన్ యాప్స్ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి.. గూగుల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న లోన్ యాప్స్ ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించిందని ఆమె వివరించారు.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి 17 లోన్ యాప్స్ తొలగించారు. ఈ యాప్స్ యూజర్ పర్సనల్ డేటాను చోరీ చేస్తున్నాయని గుర్తించారు. అంతేకాదు, ఇవి లోన్స్ రికవరీ పేరుతో యూజర్స్ పై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు గూగుల్ గుర్తించింది. దీంతో ఈ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తీసేశారు.