Horoscope 2025: ఈ రాశుల వారికి ఈ రోజు అంతా శుభమే...కానీ

ఈరోజు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం 2025 అక్టోబర్ 19 ఆదివారం శరత్‌ రుతువు, దక్షిణాయనం మాస శివరాత్రి రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం. ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఆ పూర్తి సమాచారం ఏంటంటే ...

New Update
Today Horoscope

Today Horoscope

Today Horoscope 2025

ఈరోజు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం 2025 అక్టోబర్ 19 ఆదివారం శరత్‌ రుతువు, దక్షిణాయనం మాస శివరాత్రి రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం. ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఆ పూర్తి సమాచారం ఏంటంటే ....

మేష రాశి.. మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. బంధుమిత్రులతో ఎంజాయ్ చేసే రోజు. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. అది మీకు కాస్త ఉల్లాసాన్ని కూడా అందిస్తుంది. అయితే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. జీవిత లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ముఖ్య నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను సలహాలు తీసుకోవాలి. పరిస్థితులకు తగినట్టు వ్యూహాలను మార్చుకోవాలి. వ్యాపారయోగం శుభప్రదం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. నవగ్రహ శ్లోకాలను పఠించడం మంచిది.

వృషభ రాశి.. మీ సూచనలు, అభిప్రాయాలు బంధువులు గౌరవిస్తారు.  శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.  ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులు చేయూతనిస్తారు. ఒక  వ్యక్తి నుండి మీకు ఉపకరించే సమాచారం రావచ్చు.  నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం, ఖర్చులు. ఎరుపు, లేత పసుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

మిథున రాశి..  మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్త వహించండి. అనుకున్న పనులు అవ్వాలంటే కాస్త గొడవలకు దిగకుండా జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యంపై కూడా జాగ్రత్త తప్పనిసరి. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి. కష్టంతో విజయాలు దక్కుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే మేలైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో కలిసొస్తుంది. చాలా విషయాల్లో మీదే పైచేయి అవుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశాలున్నాయి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. భూ, గృహ యోగాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మహాలక్ష్మిని ధ్యానిస్తే శుభం.

కర్కాటక రాశి..  కర్కాటక రాశి వారికి ఈ రోజు అంతా బాగుంది. అన్ని శుభప్రదంగానే ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. సమాజంలో మంచి గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత కూడా పెరిగే అవకాశం ఉంది. సకాలంలో పనులను ఆరంభించండి. విజయాలు సిద్ధిస్తాయి. మనోబలంతో ముందుకు సాగాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దైవబలం ముందుకు నడిపిస్తుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలకు ఇది సమయం కాదు. అవరోధాలు ఎదురైనా, ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకండి. ఆత్మీయులతో విరోధాలు వద్దు. ఇష్టదైవాన్ని పూజిస్తే సత్ఫాలితాలు ఉంటాయి.

సింహ రాశి.. ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు.  మిత్రులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. నిర్ణయాలతో తొందరపాటు వద్దు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ కొంతమేర ఫలిస్తుంది. వ్యాపార లావాదేవీలు మధ్యస్థంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం కొంతమేర పెరుగుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు, దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

Also Read :  ధంతేరాస్ నాడు పొరపాటున వీటిని ఇంటికి తీసుకొచ్చారో.. కటిక పేదరికం తప్పదు

కన్యారాశి..  కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. గొడవలకు దిగకుండా ఉండండి. సమాజంలో కాస్త ఇబ్బంది పడే విషయాలు కూడా జరిగే అవకాశం ఉంది. అది మీపై ప్రభావం చూపుతుంది. చిన్న చిన్న వివాదాలు కూడా పెద్దగా అయ్యే అవకాశం ఉంది. ప్రతి పనికి మనోబలం అవసరం. గెలుపు లభించే వరకూ ప్రయత్నం చేయాల్సిందే. ఆలోచనల్ని మంచివైపు మళ్లించండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతతో మెలగాలి. సంభాషణల్లో సౌమ్యత అవసరం. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. వారాంతంలో శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం మంచింది.
  
తులరాశి.. ఈ రాశివారు కొన్ని ఆసక్తికర  విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులు, సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పాతసంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధులు కొంత తేలికపడతాయి.. సాంకేతిక నిపుణులు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికరాశి.. ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. ప్రతిభను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారుల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో  స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. తెలుపు, గులాబీరంగులు, గణపతి అర్చన చేయండి.

Also Read :  ఆమె శాపంతో వందేళ్లుగా ఈ గ్రామంలో దీపావళి జరగట్లేదు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు