/rtv/media/media_files/2025/01/27/zGpOgOC1WEbzsbBksMr0.jpg)
cloves
cloves: వంటగదిలోని సుగంధ ద్రవ్యాలలో లవంగం అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో లవంగాలను మూలికలుగా పరిగణిస్తారు. లవంగం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ పడుకునే ముందు 2 లవంగాలు తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. పంటి నొప్పిని తగ్గిస్తుంది. అనేక రకాల వ్యాధులలో ఉపయోగకరంగా ఉంటుంది. లవంగం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పంటి నొప్పి, చిగుళ్ల వాపును తగ్గుతుంది:
లవంగాలను శతాబ్దాలుగా ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈస్ట్రోజెన్ లోపంతో చెవుల్లో దురద వస్తుందా?
లవంగం నూనెలో యూజినాల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది పంటి నొప్పి, చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తాయని వైద్యులు అంటున్నారు. లవంగాలను తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. లవంగాలను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: జలుబుకు కారణమయ్యే ఈ ఐదు ఆరోగ్య సమస్యలు