Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్ రోజూ ఉదయం రాగి జావ తాగితే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, గుండె సమస్యలన్నీంటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. రాగి పిండితో కేవలం జావ మాత్రమే కాకుండా రోటీలు చేసి కూడా తినవచ్చు. By Kusuma 02 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Finger Millets Health Benefits: ఈ మధ్య కాలంలో చాలా మంది మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, పోషకాలు ఉండే ఆహారం తీసుకోకుండా ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వీటన్నింటి నుంచి విముక్తి చెందాలంటే రోజూ ఉదయం రాగిజావ తాగితే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. చూడటానికి చిన్న గింజలుగా ఉండే ఈ రాగుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు! గుండె ప్రమాదాల నుంచి.. ఇవి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో బాగా ఉపయోగపడతాయి. రాగుల్లో విటమిన్ బి1, బి2, బి6, కె, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్, మాంగనీస్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధికారక ప్రమాదాల నుంచి కాపాడతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడంలో రాగులు ముఖ్యపాత్ర వహిస్తాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇది కూడా చదవండి: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే ఇందులో చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మధుమేహం ఉన్నవారు ఉదయం పూట రాగిజావ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి జావ కేవలం మధుమేహం ఉన్నవారికి మాత్రమే కాకుండా రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్ పై హార్దిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ డైలీ ఈ జావను తాగితే చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగే రాగుల్లో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సాయపడుతుంది. రాగులతో కేవలం జావ మాత్రమే కాకుండా రొట్టె కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులోని పోషకాలు, ప్రొటీన్లు, ఖనిజాల ఎముకలను బలపరుస్తాయి. ఇది కూడా చదవండి: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #rtv #health-benefits #health #life-style #best-health-tips #ragi-java #health-tips-for-heart #finger-millet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి