/rtv/media/media_files/5keSP5JRx5uHkg9rIV7E.jpg)
water
ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పరగడుపున మెంతులు వాటర్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంతో పాటు వాపును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మెంతులు తీసుకోవడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలిపోయే సమస్య తగ్గడంతో పాటు పెరుగుతుంది. మెంతులులోని ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. అలాగే ఫైటోఈస్ట్రోజెన్‌లు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు మెంతులు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి కడుపు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Heart Attack: ఆరోగ్యకరమైన గుండె కోసం రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఈ పండ్లు చేర్చుకోండి
నానబెట్టి తీసుకోవడం వల్ల..
మెంతులు బాడీలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువు అధికంగా ఉన్నవారు సన్నబడటానికి మెంతులు బాగా ఉపయోగపడతాయి. కొందరికి బాడీలో నీరసం, కడుపు నిండుగా అనిపిస్తుంది. అలాంటి వారు ఉదయాన్నే మెంతులు వాటర్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. అయితే కప్పు నీటిలో రాత్రిపూట మెంతులు నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని మరిగించి లేదా ఆ వాటర్ సాధారణంగానే తాగవచ్చు. ఇలా చేయడం వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి జబ్బులు ఉన్నా కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మెంతులు వాటర్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు బాగా తోడ్పడతాయి. డైలీ ఉదయం పరగడుపున ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కూడా తీరిపోతాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Relationship Tips: బంధాన్ని బలపరిచే అలవాట్లు.. ఖరీదైన బహుమతుల కంటే ఇవే ముఖ్యం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.